
పిక్ క్రెడిట్: పల్లవ్ పల్లివాల్
బాలీవుడ్ స్వీట్ కపుల్ దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్ గణేష్ చతుర్థి (ఆగస్టు 27న)ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ జంట అంబానీ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దురంధర్ నటుడు రణవీర్ న్యూలుక్ వైరల్‌గా మారింది. పాప పుట్టిన తరువాత పబ్లిక్ అప్పియరన్స్‌కు దూరంగా ఉన్న వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. పల్లవ్ పల్లీవాల్ ఇన్‌స్టాలో షేర్ చేసిన కొన్ని సెకన్లు మాత్రమే ఉన్న వీరి వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
గోల్డ్ అండ్‌గ్రీన్ దుస్తుల్లో దీపికా ,రణ్‌వీర్ సింగ్ మెరిసారు. ముఖ్యంగా ధురంధర్ షూటింగ్ ప్రారంభించిన నెలల తర్వాత వచ్చిన క్లీన్-షేవ్ లుక్ నెటిజన్లు ఆకర్షిస్తోంది. పొడవాటి జుట్టు, గడ్డాన్ని తొలగించి కనిపించాడు. ఈ దంపతులు ముంబైలోని వరసిద్ధి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. గర్భంతో ఉన్నపుడు దీపికా ఈ గణపతిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.
దీపికా పదుకొనే- రణ్‌వీర్ సింగ్ గత ఏడాది సెప్టెంబర్ 8న తమ తొలి సంతానం దువాకు జన్మనిచ్చారు. దువాకు మరికొన్ని రోజుల్లో సంవత్సరం నిండనుంది. తమ కుమార్తెను ప్రజల దృష్టి నుండిదూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఫోటోలను తీయవద్దని కూడా అభ్యర్థించారు కూడా. మరి దువా ఫస్ట్ బర్త్‌డే వేడుకలు ఘనంగా ఉండబోతున్నాయా?ఈ సందర్భంగా నైనా పాపను చూపిస్తారా? అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉందైంది.
కాగా రణ్‌వీర్ సింగ్ ధురంధర్ ఫస్ట్ లుక్ సినిమా హాళ్లలో సందడి చేయనుంది. ఇటీవల డిజిటల్‌గా లాంచ్ అయిన 2 నిమిషాల 42-సెకన్ల కట్, రేపు సినిమాల్లో విడుదలయ్యే పరమ సుందరికి జతచేయబడుతుంది. జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 5 డిసెంబర్ 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.