
సాక్షి,తాడేపల్లి: వినాయక చవితి పర్వదిన్నాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని.. ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు.