సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో తమకు ప్రాధాన్యమివ్వడం లేదన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలను మాత్రమే పట్టించుకున్నారు.. ఎంఐఎం ఎమ్మెల్యేలంటే ప్రభుత్వానికి ఎందుకు భయం? అంటూ ప్రశ్నించారు. మంత్రిని అడిగితే కూల్ అంటున్నారు. కూల్.. కూల్ అనే ఇంతవరకు వచ్చిందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ప్రభుత్వ నిబంధనలు అధికారులు ఫాలో కావడం లేదు. నా విషయంలో ఏమవుతుందో నాకు తెలియదు. నేను ఫైటర్‌ను.. ఫైట్ చేస్తా. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటాం’’ అని దానం పేర్కొన్నారు. కాగా, తనకు దానం నాగేందర్ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారంటూ వచ్చిన వార్తలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ.. తనకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వలేదన్నారు. నోటీసులు ఇస్తే ఎమ్మెల్యే ప్రివిలేజ్ కాపాడే చర్యలు తాను తీసుకుంటానన్నారు.
దానం నాగేందర్ వ్యాఖ్యలపై మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. నిబంధనల ప్రకారమే ఇండ్ల పంపిణీ జరుగుతుందన్నారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి: సిద్దిపేటలో హైటెన్షన్..


