నిజామాబాద్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రివాల్వర్‌తో ఆర్‌ఐ ఆత్మహత్య! | Nizamabad Police RI Satish Suicide | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రివాల్వర్‌తో ఆర్‌ఐ ఆత్మహత్య!

Sep 18 2026 8:58 AM | Updated on Sep 18 2026 9:40 AM

Nizamabad Police RI Satish Suicide

తెలంగాణ: నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హోంగార్డు ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సతీష్‌.. సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హెడ్‌క్వార్టర్స్‌లోనే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

సతీష్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే, ప్రాథమికంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అసలు కారణమేంటనేది దర్యాప్తు పూర్తయిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: వైషు అమ్మ–హరిబాబు కేసులో ఇవేం ట్విస్టులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement