బెంగళూరు: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అస్వస్థకు గురయ్యారు. ఈ రోజు ( శనివారం) ఉదయం ఆయన అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయారు. అమిత్‌షా రాక కోసం ప్రజలంతా ఎదురుచూస్తుండగా ఆయన అస్వస్థకు గురయ్యారని కార్యక్రమానికి హాజరుకాలేరని ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రకటించారు.
కర్ణాటక హుబ్లీలో కేఎల్‌ఈ ఆసుపత్రి, మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ని ఈ రోజు శనివారం అమిత్‌షా ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కర్ణాటకాకు అమిత్‌షా చేరుకుని హోటలలో బస చేశారు. అయితే ఈ రోజు 11 గంటలకు ఆసుపత్రి ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. దీంతో ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో పాటు కళాశాల సిబ్బంది ఆయన రాక కోసం వేచి చూశారు. ఈ నేపథ్యంతో ఆయన అస్వస్థకు గురయ్యారని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాలేరని ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రకటించారు.
అస్వస్థతకు గురై హోటల్‌లోనే వైద్యుల వద్ద చికిత్స పొందుతున్నాడని వర్గాలు తెలిపాయి. అమిత్‌షా అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, ఎంపీలు బసవరాజ్ బొమ్మై, ఇరన్న కడాడి, మాజీ మంత్రి మురుగేశ్ నిరానీ, ఎమ్మెల్యేలు సీసీ పాటిల్ తదితరులు ఆయనను పరామర్శించారు.


