నీటిపై తేలుతున్న డ్రమ్ములో షాకింగ్‌ దృశ్యం | Hindu Man Body Found Floating In A Drum In Bangladesh | Sakshi
Sakshi News home page

నీటిపై తేలుతున్న డ్రమ్ములో షాకింగ్‌ దృశ్యం

Sep 27 2026 12:54 PM | Updated on Sep 27 2026 1:24 PM

Hindu Man Body Found Floating In A Drum In Bangladesh

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైమెన్సింగ్ జిల్లాలోని బెగున్‌బారి ప్రాంతంలో స్లూయిస్ గేట్ సమీపంలో నీటిలో తేలుతున్న డ్రమ్‌లో 50 ఏళ్ల హిందూ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని నగల వ్యాపారి నిరంజన్ చంద్ర సూత్రధర్గా గుర్తించారు. మైమెన్సింగ్‌లోని అథర్‌బారి బిల్డింగ్ ప్రాంతంలో మరో వ్యక్తి భాగస్వామ్యంతో ఆయన నగల దుకాణం నడుపుతున్నారు.

నిరంజన్‌ను ఎవరు హత్య చేశారు? హత్యకు కారణం ఏమిటన్నది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. మృతుడి తల, ఛాతిపై పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాల గుర్తులు ఉన్నాయి. నిరంజన్‌ను ముందుగా హత్య చేసి.. అనంతరం మృతదేహాన్ని డ్రమ్‌లో ఉంచి నీటిలో పడేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మృతదేహం ఉన్న ప్యాంటు జేబులో మైమెన్సింగ్ హిందూ కోఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ లిమిటెడ్ జారీ చేసిన ఒక టోకెన్‌ను పోలీసులు గుర్తించారు. ఆ టోకెన్ ఆధారంగా సంస్థను సంప్రదించడంతో మృతుడి వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం అతని భార్య సుమితా రాణి సూత్రధర్, కుమారుడు జాయ్ సూత్రధర్.. మృతదేహాన్ని గుర్తించారు.

ఇదీ చదవండి: రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement