BAN vs AFG: ట్రిపుల్ సెంచరీ వీరుడికి పిలుపు! | Bangladesh Test Squad vs Afghanistan Announced, Nahid Rana Excluded | Sakshi
Sakshi News home page

BAN vs AFG: ట్రిపుల్ సెంచరీ వీరుడికి పిలుపు!

Sep 19 2026 5:56 PM | Updated on Sep 19 2026 6:08 PM

Bangladesh Test Squad vs Afghanistan Announced, Nahid Rana Excluded

PC: BCB

యూఏఈ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌ర‌గ‌నున్న ఏకైక టెస్టు కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ జట్టు కెప్టెన్‌గా నజ్ముల్ హోస్సేన్ షాంటో వ్యవహరించనున్నాడు. 

అదేవిధంగా దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అఫీషియల్ టెస్ట్ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో సత్తాచాటిన తౌహిద్ హృదయ్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్ జాకీర్ అలీ కూడా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. 

మరోవైపు యువ పేసర్ నహిద్ రానా గాయం కారణంగా అఫ్గాన్‌తో టెస్టుకు కూడా దూరమయ్యాడు.  లిట్టన్ దాస్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్ వంటి సీనియర్ ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 9 నుంచి 13 వరకు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. కాగా బంగ్లా జట్టు ఇటీవలే ఆస్ట్రేలియా జట్టుకు వారి సొంతగడ్డపైన ఓడించిన సంగతి తెలిసిందే.

అఫ్గాన్‌తో టెస్టుకు బంగ్లా జట్టు:  నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్‌), తాంజిద్ హసన్, షాద్మాన్ ఇస్లాం, సౌమ్య సర్కార్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్, ఎబాదోత్ ఇస్లాం, ఎబాదోత్ ఇస్లాం.

ట్రావెలింగ్ రిజర్వ్: నయీమ్ హసన్, ముస్ఫిక్ హసన్, ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్
చదవండి: భారత జ‌ట్టులో అత‌డి పేరు చూసి షాక‌య్యా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement