చేవెళ్ల/మొయినాబాద్: చేవెళ్ల డివిజన్ పరిధిలో మూడు మూడు 2బీ బార్ల ఏర్పాటు ముందస్తు అనుమతికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ చేవెళ్ల సీఐ కల్పన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 41 కొత్త 2బీ బార్లు ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని.. అందులో డివిజన్ పరిధిలోని చేవెళ్ల ము న్సిపాలిటీలో ఒకటి, మొయినాబాద్ మున్సిపాలిటీలో రెండు 2బీ బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటల లోపు రూ.లక్ష రుసుము(తిరిగి చెల్లించబడదు)తో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 16న ఉదయం 11 గంటల కు లాటరీ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు. ఫ్యూచర్‌సిటీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికా రి కార్యాలయంలోగాని, జిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోగాని, నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలోగాని దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలకు ఎకై ్సజ్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని చెప్పారు.
ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా సుదర్శన్
మహేశ్వరం: ఓబీసీ మోర్చా రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడిగా మహేశ్వరం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పోతర్ల సుదర్శన్ యాదవ్ నియమితులయ్యారు. ఆదివారం ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఓబీ సీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్‌గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్‌యాదవ్ మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో నియమించిన పార్టీ పెద్దలకు, సహకరించిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు.
కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ శిరీష్
ఆమనగల్లు: అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టుల ఏర్పాటు నిర్ణయం సాహసోపేతమైనదని కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ ఆకుల శిరీష్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం జీఓ నంబర్ 59 ద్వారా కొత్త కోర్టులను ఏర్పాటు చేసిందన్నారు. న్యాయస్థానాలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు సత్వరన్యాయం అందేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు.
యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి
తుక్కుగూడ: త్వరలో జరగనున్న రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలపునకు కృషి చేయాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. యువజన కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి రాంచందర్‌రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షుడు సుభాన్ యాదవ్, మండల అధ్యక్షుడు రాజ తదితరులు పాల్గొన్నారు.
యాచారం: ఫార్మా భూ బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట రైతుల నిరసన కార్యక్రమం ఉంటుందని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ అంగీకారం లేకుండానే టీజీఐఐసీ పేరు మీద భూరికార్డులు మార్చేసి, అథారిటీలో పరిహారం డబ్బులు జమ చేశారని.. పలుమార్లు భూరికార్డులు తమ పేరిట మార్చాలని కోరినా ఫలితం లేకపోవడంతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరారు.


