పరిగి: మండలంలోని బసిరెడ్డిపల్లి శివారులో సంచ రిస్తోంది చిరుత కాదని హైనా అని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితం కృష్ణగిరి క్షేత్రం గోశాలలో లేగ దూడను చిరుతను పోలిన మృగం ఎత్తుకెళ్లింది. మరుసటి రోజు ఆవుపై దాడికి పాల్పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న గోశాఖ సంరక్షకుడు భయంతో పారిపోయాడు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రతిమ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గోశాల సంరక్షకుడి చెప్పిన ఆనవాళ్లను బట్టి హైనాగా నిర్దారించారు. హైనాలు కూడా చిరుత పులిని పోలి ఉంటాయని, పశువులపై దాడులు చేస్తాయని తెలిపారు.


