సీజేపీ నేతల కస్టడీ పొడిగింపు | CJP Leaders Judicial Custody Extended | Sakshi
Sakshi News home page

సీజేపీ నేతల కస్టడీ పొడిగింపు

Oct 20 2026 9:10 AM | Updated on Oct 20 2026 9:11 AM

CJP Leaders Judicial Custody Extended

కోర్టు హాల్‌లోకి వెళుతున్న సౌరవ్‌ దాస్, అశుతోష్‌ రాంకా

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ)నేతలు సౌరవ్‌ దాస్, అశుతోష్‌ రాంకాలకు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. మందిర్‌ మార్గ్‌ పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా నియమితులైన స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13వ తేదీన జంతర్‌మంతర్‌ వద్ద ఆంక్షలను ఉల్లంఘించిన ఆరోపణలపై వీరిద్దరినీ కోర్టు ఐదు రోజుల జ్యుడీíÙయల్‌ కస్టడీకి పంపించింది.

ఆదివారం వీరి బెయిల్‌ పిటిషన్లపై స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ విచారణ జరిపారు. అయితే, తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత విచారణ జరపాల్సి ఉన్నందున, వీరి కస్టడీని రెండు రోజులు పొడిగించాలంటూ సోమవారం పోలీసులు మేజిస్ట్రేట్‌ను కోరగా, ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సౌరవ్, అశుతో‹Ùలను తిరిగి బుధవారం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చాల్సి ఉందని అధికారులు తెలిపారు.

హత్య కేసులో దోషికి అలా..
సీజేపీ నేతలకు ఇలా: దీప్కే
ఒక హత్య కేసులో దోషిగా ఉన్న బీజేపీ నేతకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా అలహాబాద్‌ హైకోర్టు అతడికి విధించిన శిక్షతోపాటు, దోషిగా తేల్చడాన్ని నిలిపివేయాలంటూ స్టే ఇచ్చిందని, ఎలాంటి నేర ఘటనలతో సంబంధం లేని తమ పార్టీ కో కనీ్వనర్లు అశుతోష్‌ రాంకా, సౌరవ్‌ దాస్‌లకు మాత్రం కోర్టు జ్యుడీíÙయల్‌ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ధ్వజమెత్తారు.

అలహాబాద్‌ హైకోర్టు హత్య దోషి శిక్షను నిలిపివేసిందనే వార్తా కథనం హెడ్‌లైన్‌ను, అశుతోష్, సౌరవ్‌ల కస్టడీ పొడిగింపు గురించిన మరో వార్తా కథనం స్క్రీన్‌షాట్‌లను దీప్కే ఎక్స్‌లో షేర్‌ చేశారు. తమ నేతలను నిర్బంధంలోనే ఉంచేందుకుగాను బెయిల్‌ పిటిషన్లపై విచారణను ఉద్దేశపూర్వకంగానే అధికారులు ఆలస్యం చేస్తున్నారని దీప్కే ఆరోపించారు. ఎలాంటి సహేతుక కారణాలు చూపకుండానే ఆదివారం కోర్టు వారి బెయిల్‌ ష్యూరిటీలను తిరస్కరించిందని ఆరోపించారు. ఉన్నత చదువులు చదువుకుని, ఉన్నతోద్యోగాల్లో ఉంటున్న వీరిద్దరూ దేశం కోసమే తమ కెరీర్‌ను త్యాగం చేశారని చెప్పారు.

కోర్టులో సర్కస్‌ ఫీట్లు : రత్నా సింగ్‌
తన జీవితంలో ఎన్నడూ ఇలాంటి అసంబద్ధ వ్యవహారాలను చూడలేదని సీజేపీ న్యాయ విభాగం హెచ్‌ రత్నా సింగ్‌ వ్యాఖ్యానించారు. స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో జరుగుతున్న పరిణామాలు సర్కస్‌ను తలపిస్తున్నాయని అభివర్ణించారు. అశుతో‹Ù, సౌరవ్‌లను కస్టడీలోనే ఉంచేందుకు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆ కోర్టును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వారిద్దరి విడుదలకు సమర్పించిన పూచీకత్తులను తిరస్కరించడాన్ని ఆమె ప్రశ్నించారు. వారి విడుదలతో శాంతిభద్రతల ఉల్లంఘనకు ఎలాంటి అవకాశం ఉన్నట్లు నిరూపించలేకపోయారని చెప్పారు.

విచారణ సందర్భంగా మేజిస్ట్రేట్‌ ప్రవర్తనను కూడా ఆమె ప్రశ్నించారు. కోర్టు హాల్‌లో ఆ అధికారి ఫోన్‌లో మాట్లాడారని ఆరోపించారు. ఈ విచారణలు వ్యక్తిగత స్వేచ్ఛపై తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ మొత్తం తమను అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కాబోవని ఆమె అన్నారు. ‘దేశ యువత ఇదంతా గమనిస్తోంది. అధికారాన్ని ఎలా దుర్వినియోగిస్తున్నారో వారు చూస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కి వేసేందుకు అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చివరికి సమాధానం చెప్పక తప్పదు’అని ఆమె అన్నారు.

ఇదీ చదవండి: తుది దశలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement