న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) స్పందించింది. టీడీపీ పాల్పడ్డ అక్రమాలపై సీజేపీ నేత అశుతోష్ రంకా ఆధారాలతో పాటు ట్వీట్ చేశారు. రిగ్గింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నేతల దృశ్యాలు అందులో ఉన్నాయి. ఓ వైపు హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రజాస్వామ్యం కోసం అంటూ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలోనే పక్క రాష్ట్రం ఏపీలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అశుతోష్ రంకా గుర్తు చేశారు.
‘‘హైదరాబాద్‌లో అమిత్ షా ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ సభ నిర్వహిస్తున్నారు.. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బూత్‌ల ఆక్రమణ, ఎన్నికల అక్రమాలకు సంబంధించిన దృశ్యాలు ఇవిగో... చంద్రబాబు నాయుడు, ఆయన బృందం ఎన్నికల నియంతృత్వానికి సరికొత్త నిర్వచనాలు చెబుతోంది’’ అని అశుతోష్ రంకా విమర్శలు గుప్పించారు.
కాగా, కౌంటింగ్ రోజు కూడా టీడీపీ నేతలు గందరగోళం సృష్టించారు. అనేక ప్రాంతాల్లో అరాచకాలకు పాల్పడ్డారు. జీవీఎంసీ ఎన్నికల్లోనూ కూటమి కుట్రలకు పాల్పడింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచిన చోట రీ కౌంటింగ్ కు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చెల్లని ఓట్లతో రీ కౌంటింగ్ జరపాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. మోల్లి లక్ష్మి, షేక్ జన్నీరుషా వైఎస్సార్‌సీపీ తరఫున కార్పొరేటర్లుగా విజయం సాధించారు. 19, 65 వార్డుల నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. టీడీపీ నేతలు ఒత్తిడితో రీకౌంటింగ్ జరుపుతున్నారు అధికారులు. అధికారుల తీరుపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ‍్యక్తం చేశారు.
While Amit Shah is busy holding "Loktantra Bachao" rally in Hyderabad, here are the visuals of booth capturing and electoral rigging in the neighbouring Andhra. @ncbn and Co are setting new benchmarsks of electoral autocracy. @VijayMallangi https://t.co/R4hRsOehXE
— Ashutosh Ranka (@AshutoshRanka) November 3, 2026


