9 సార్లు రీకౌంటింగ్.. ఫ‌లితం తారుమారు! | Andhra Pradesh Local Body Elections 2026 Results: Inside Incidents | Sakshi
Sakshi News home page

రీకౌంటింగ్‌లో ఫ‌లితం హైజాక్‌!

Nov 3 2026 7:25 PM | Updated on Nov 3 2026 7:47 PM

Andhra Pradesh Local Body Elections 2026 Results: Inside Incidents

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో కూటమి నేతల దౌర్జన్యకాండ కొన‌సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిని త‌మ పార్టీలో చేరాల‌ని టీడీపీ నాయ‌కులు కుట్ర‌లు చేస్తున్నారు. పలమనేరులో 34వ వార్డు నుంచి గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి సల్మా భారతిపై ఒత్తిడి పెంచుతున్నారు. సల్మా భారతి 6 ఓట్లతో గెలిచినా.. ప‌చ్చ పార్టీ నేత‌లు అధికారుల‌పై ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికి 9 సార్లు రీకౌంటింగ్ చేయించారు. టీడీపీ నాయ‌కుల ఆదేశాల‌తోనే సల్మా భారతి విజ‌యాన్ని అధికారులు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. త‌మ పార్టీలో చేరాలని సల్మా భారతిని టీడీపీ నేత‌లు ఒత్తిడి చేస్తున్నారు. ఒప్పుకోక‌పోవ‌డంతో ఆమె విజ‌యాన్ని అడ్డుకుంటున్నార‌ని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది.

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి ఫ‌లితాన్ని తారుమారు చేసేంది. 27వ డివిజన్ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి గీతా మోహన్ గెలుపొంద‌గా, రీకౌంటింగ్‌లో ఫ‌లితాన్ని మార్చేశారు. స్వతంత్ర అభ్యర్థి రేవతి గెలిచినట్టు ప్రకటించ‌డంతో వైఎస్సార్‌సీపీ నేత‌లు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. అధికారుల వ్య‌వ‌హార‌శైలిపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

మంత్రి మాయాజాలం
కర్నూలు మున్సిప‌ల్‌ కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో స్వ‌యంగా మంత్రి టీజీ భరత్ రంగంలోకి దిగి వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి విజ‌యాన్ని అడ్డుకున్నారు. కమిషనర్ చల్లా ఓబులేసుపై ఒత్తిడి తీసుకొచ్చి కౌంటింగ్ కేంద్రంలోని అధికారుల స‌హ‌కారంతో ఫ‌లితాన్ని తారుమారు చేశారు. 49వ వార్డులో 11 ఓట్లతో వైఎస్సార్‌సీపీ విజయం సాధించ‌గా.. డిక్లరేషన్ ఫాం ఇవ్వకుండా టీజీ భరత్ అడ్డుప‌డ్డారు. రీకౌంటింగ్ డ్రామాకు తెర‌లేపారు. రీకౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీకి వ‌చ్చిన 15 ఓట్లు చెల్లనివిగా పరిగణించి, 4 ఓట్లతో టీడీపీ విజయం సాధించిన‌ట్టు అధికారులతో ప్ర‌క‌టింప‌జేశారు. కూట‌మి ప్ర‌భుత్వ కుట్ర‌పై వైఎస్సార్‌సీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదీ చ‌ద‌వండి: ఎన్నిక‌ల ఫ‌లితాల్లోనూ టీడీపీ కుయుక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement