సాక్షి, తాడేపల్లి: స్థానిక ఎన్నికల తీరుపై, అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబు గూండారాజ్ పాలనపై జగన్ పైర్ అయ్యారు. ఎస్ఈసీ తీరును కూడా తప్పు పడుతూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ఇవి ఎన్నికలు కావని.. కేవలం సెలక్షన్లు మాత్రమేనని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
‘‘చంద్రబాబు నాయుడి టీమ్‌కు, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందనలు! ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశమే లేకుండా చేసి ఎన్నికల్లో ఘన విజయం ఎలా సాధించాలో మీరు నిరూపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల సంస్కరణలు అత్యవసరం. దేశంలో ఎన్నికల సంస్కరణల అవసరమనే విషయం ఇంతకంటే స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు.
ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అక్రమాలే..
- నామినేషన్: హ్యాక్ చేశారు!
- నామినేషన్ల పరిశీలన: హ్యాక్ చేశారు!
- ఉపసంహరణ: హ్యాక్ చేశారు!
- పోలింగ్ ఏజెంట్లు: అడ్డుకున్నారు, బలవంతంగా బయటకు పంపించారు!
- పోలింగ్: అక్రమాలకు పాల్పడ్డారు!
- పోలింగ్ శాతం: తారుమారు చేశారు!
- ఓట్ల లెక్కింపు: హ్యాక్ చేశారు!
అభ్యర్థులను మీరే ఎంపిక చేశారు.. ప్రజలు ఎన్నడూ వారిని ఎన్నుకోలేదు! ఇవి ఇక ఎన్నికలు కావు.. కేవలం సెలక్షన్స్ మాత్రమే’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: లాటరీ పద్ధతిలో విజేత.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపు
Congratulations, Team @ncbn, Police, and SEC! You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete! At every stage, the process was rigged: * Nomination: Hijacked! * Scrutiny: Hijacked! * Withdrawal: Hijacked! * Polling agents: Obstructed or Pulled Out! * Poll: Rigged! * Poll percentage: Manipulated! * Counting: Hijacked! You selected the candidates; the people never elected them! These are no longer elections but selections! The need for electoral reforms has never been more obvious! #CBNJungleRaj @ECISVEEP
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 3, 2026


