'అనుపమ అంటే నాకు కూడా క్రష్'.. ప్రముఖ టాలీవుడ్ లిరిసిస్ట్ | tollywood Lyricist Kasarla Shyam Comments about actress anupama | Sakshi
Sakshi News home page

Anupama: 'అనుపమ అంటే నాకు కూడా క్రష్'.. ప్రముఖ టాలీవుడ్ లిరిసిస్ట్

Oct 15 2026 11:09 AM | Updated on Oct 15 2026 11:09 AM

tollywood Lyricist Kasarla Shyam Comments about actress anupama

అనుపమ పరమేశ్వరన్, నరేష్‌ వీకే, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ ఉడ్డెమారి ప్రధాన  పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌ మోహన్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఇటీవలే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. తాజాగా ఈ మూవీ టీమ్ మరో ఈవెంట్ ఏర్పాటు చేసింది. క్రేజీ కల్యాణం బరాత్ పేరుతో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన ప్రముఖ టాలీవుడ్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అందరిలాగే అనుపమ అంటే నాకు క్రష్ అని.. మొదటి చూపులోనే పడిపోయానని తన మనసులోని మాట బయటపెట్టారు. అందుకే ఆమెను అఆ అని పిలుస్తానని.. అ అంటే అనుపమ.. ఆ అంటే ఆరాధన అని అన్నారు. అందుకే ఆమెను తాను క్రేజీగా ఆరాధిస్తున్నానని కాసర్ల శ్యామ్ తెలిపారు. నేను మీకు అభిమానిని అయిపోయానని లిరిసిస్ట్ శ్యామ్ వెల్లడించారు. మీరు పాటలు కూడా మంచిగా పాడతారని అనుపమను కొనియాడారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement