నేను చేసిన పెద్ద తప్పు అదే.. ‘నో’చెప్పలేకపోయా: అనుపమ | Anupama Parameswaran Share Interesting Things About Her Personal Life | Sakshi
Sakshi News home page

నేను చేసిన పెద్ద తప్పు అదే.. ‘నో’చెప్పలేకపోయా: అనుపమ

Oct 25 2026 11:24 AM | Updated on Oct 25 2026 11:50 AM

Anupama Parameswaran Share Interesting Things About Her Personal Life

ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు నటి అనుపమ పరమేశ్వరన్‌. ఇటీవల ‘క్రేజీ’ కల్యాణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మలయాళ బ్యూటీ.. త్వరలోనే ‘భోగీ’తో తెలుగు ఆడియన్స్‌ని పలకరించబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగా ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. కొన్ని విషయాల్లో ఇతరులకు నో చెప్పలేక చాలా కాలం పాటు తనను తాను కోల్పోయానని.. ఈ మధ్యే  ఈ విషయం గ్రహించి..తనకు నచ్చినట్లుగా జీవించడం మొదలుపెట్టానని చెప్పింది. 

‘నా జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏంటంటే..చాలా కాలంపాటు నా కోసం నేను బతకడం మర్చిపోయా. చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్లగా కుటుంబం ఆశించే బాధ్యతలను నెరవేర్చడమే నా కర్తవ్యంగా భావించా. సినిమాల్లోకి వచ్చిన తర్వాత.. నా వల్ల పెరెంట్స్‌కి ఎలాంటి ఇబ్బందులు రావొద్దని భయంతో బతికాను. ఇతరుల కోసం ఎంతో ఒత్తిడిని భరించాను. ఇలా ప్రతిసారి ఇతరుల గురించి ఆలోచించి..నా మనశ్శాంతిని, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా. 

(చదవండి: ఓటీటీలోకి అద్భుతమైన సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు)

చాలా విషయాల్లో ఇతరులకు నో చెప్పలేక ఇబ్బంది పడ్డాను. ఈ మధ్య ఈ విషయం గ్రహించి.. నచ్చని విషయాలను నో చెప్పేస్తున్నా. మన జీవితంలో తొలి ప్రాధాన్యత మనకే ఇచ్చుకోవాలని ఆలస్యంగా తెలుసుకున్నా. మనల్ని మనమే ప్రేమించుకోకపోతే, ఇతరులు మనల్ని ఎలా ప్రేమిస్తారు?’అని అనుపమ అన్నారు. 

కాగా, అనుపమకు ఇటీవల బ్రేకప్‌ అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ కొంతకాలం డేటింగ్ చేసిన ఆమె..ఇటీవల విడిపోయారు. అప్పటి నుంచి అనుపమలో మార్పు వచ్చింది. ఇతరుల గురించి కాకుండా ఇకపై తన కోసం బతకడం ప్రారంభించినట్లు  ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement