breaking news
Missile Explosion
-
మంచు విష్ణుకు దుబాయ్‌లో మిస్సైల్ పేలుడు అనుభవం
దుబాయ్‌లో కుటుంబంతో ఉన్న హీరో మంచు విష్ణు తాజాగా జరిగిన మిస్సైల్ పేలుడు సమయంలో తన ఇల్లు కంపించిందని, ఆ క్షణం తీవ్ర భయానకంగా అనిపించిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. In Dubai visiting family tonight. Missiles visible in the sky. The loud interceptions shook our home and frightened little Ayra.Praying for peace. No child anywhere should grow up hearing the sound of war above their roof.Grateful to the UAE defense forces for keeping… pic.twitter.com/tCbE78eoBY— Vishnu Manchu (@iVishnuManchu) February 28, 2026మిస్సైల్ పేలుడు కారణంగా మా ఇల్లు షేక్ కావడం వల్ల మేము తీవ్రంగా భయపడ్డాం. శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ కూడా తమ ఇళ్ల పైకప్పు పైన యుద్ధ శబ్దం విని పెరగకూడదు. పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యుఎఇ రక్షణ దళాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు జీవితం ఎంత దుర్బలమైనదో గుర్తు చేస్తాయి. శక్తి, శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. హర్ హర్ మహాదేవ్ అంటూ మంచు విష్ణు తన ట్వీట్‌ను ముగించారు. యుద్ధ పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఎదుర్కొనే భయాన్ని ఆయన మాటలు ప్రతిబింబిస్తున్నాయి. -
క్రూయిజ్ క్షిపణులు పేల్చిన నార్త్ కొరియా
ప్యాంగ్యాంగ్: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పొరుగు దేశం దక్షిణ కొరియాను రెచ్చగొట్టే విధంగా నార్త్ కొరియా చర్యలుండటమే ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తాజాగా ఆదివారం(జనవరి 28) ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా తన భూభాగంలోని సింప్నో ప్రాంతానికి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లోకి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ‘ఆదివారం ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా గుర్తు తెలియని కొన్ని క్రూయిజ్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించినట్లు మా ఆర్మీ గుర్తించింది’ అని సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కూడా ఉత్తర కొరియా సముద్రంలో ఆర్టిలరీ బాంబులు వేసి ద్వీపకల్పంలో ఉద్రిక్తలకు కారణమైన విషయం తెలిసిందే. ఇదీచదవండి..బ్రిటీష్ నౌకపై హౌతీ మిలిటెంట్ల దాడి -
ఉత్తర కొరియా క్షిపణి పేలింది!
ఆయుధ బలప్రదర్శన మరునాడే పరీక్ష విఫలం సియోల్: ఉత్తర కొరియా క్షిపణి ఒకటి పరీక్షిస్తుండగా పేలిపోయిందని అమెరికా, దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. తూర్పు తీరంలో సిన్పోలో ఆదివారం హై ప్రొఫైల్ క్షిపణి పరీక్ష విఫలమైనట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నదని చెప్పారు. అమెరికాను పరోక్షంగా సవాలు చేస్తూ సైనిక వార్షిక దినోత్సవం సందర్భంగా భారీ ఆయుధ బలసంపత్తి ప్రదర్శనతో ఉత్తర కొరియా శనివారం హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరునాడు చేపట్టిన క్షిపణి పరీక్ష ఇలా విఫలం కావడం ఉత్తరకొరియాకు ఎదురుదెబ్బగా మారింది. ఉత్తర కొరియా అణ్వాయుధ ప్రయోగాలతో చెలరేగిపోతున్న నేపథ్యంలో ఆ దేశాన్ని కట్టడి చేసేందుకు అమెరికా కొరియా ద్వీపకల్పంలో తన భారీ వైమానిక యుద్ధనౌకను మోహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాను సవాల్ చేసేందుకు, తన ఆయుధ బలాన్ని చాటుకునేందుకు కొరియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ క్షిపణి పరీక్షను చేపట్టారని, అయితే, ఏ రకమైన క్షిపణి, దీని సామర్థ్యం ఎంత అనే వివరాలు తెలియదని అధికార వర్గాలు తెలిపాయి.


