‘ఇడుపు కాయితం’.. ఆకట్టుకుంటున్న ‘శ్రీలత సాంగ్‌’ ప్రోమో | Srilatha Song Promo Out From Idupu Kayitham Movie | Sakshi
Sakshi News home page

‘ఇడుపు కాయితం’.. ఆకట్టుకుంటున్న ‘శ్రీలత సాంగ్‌’ ప్రోమో!

Aug 26 2026 2:37 PM | Updated on Aug 26 2026 2:37 PM

Srilatha Song Promo Out From Idupu Kayitham Movie

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహించగా, బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా  మేకర్స్ ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ "ఇడుపు కాయితం" సినిమా నుంచి 'శ్రీలత సాంగ్..' ప్రోమో రిలీజ్ చేశారు. 

కొత్తగా పెళ్లయిన జంట శ్రీలత, శ్రీనివాస్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు. ‘ఓ శ్రీలత శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత, ఓ శ్రీలత శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత, శ్రీలత శ్రీలత శ్రీలత ఈ శ్రీనివాసుడే నీ జత' అంటూ సాగే  ఈ పాట ఫుల్ వెర్షన్  త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మంచి మెలొడీ ట్యూన్ తో ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement