అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో రూపొందించిన మరో యాప్ జుఒన్ (JUONE). ఈ యాప్‌ను ప్రముఖ నటి ఇంద్రజ చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని పీర్‌లెస్ హోటల్‌లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నటి ఇంద్రజతో పాటు ఏఎన్‌ఎన్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకులు కంది రామచంద్రారెడ్డి, జబర్దస్త్ రాము, యాప్ బ్రాండ్ అంబాసిడర్ రాధిక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతో పాటు సెమీ-అర్బన్, పట్టణ ప్రాంతాల్లో ‘జుఒన్’ సూపర్ యాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా నటి ఇంద్రజ మాట్లాడుతూ.. 'ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రజల రోజువారీ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించడం అభినందనీయమని నిర్వహకులను అభినందించారు. జుఒన్ సూపర్ యాప్ ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉపయోగపడుతుంది. ఈ వినూత్న ప్రయత్నం విజయవంతం కావాలని' ఆమె ఆకాంక్షించారు.
జుఒన్ బ్రాండ్ అంబాసిడర్ రాధిక మాట్లాడుతూ.. 'ఫుడ్ డెలివరీ, షాపింగ్, ప్రయాణం, ఆరోగ్యం, గృహ సేవలు వంటి అనేక అవసరాలకు ఒకే యాప్ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది. 25 రకాల సర్వీసులు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా రూపొందించిన జుఒన్ సూపర్ యాప్‌ను ప్రజలు ఆదరించాలి. ఈ యాప్ మరింత అభివృద్ధి చెంది విస్తృత ఆదరణ పొందాలని' ఆకాంక్షించారు.
ఒకే యాప్.. ఎన్నో సేవలు..
‘కనెక్ట్, సర్వీసెస్, గ్రో’.. ‘వన్ యాప్, మెనీ సొల్యూషన్స్’ అనే నినాదాలతో ముందుకొచ్చిన జుఒన్.. వినియోగదారుల రోజువారీ అవసరాలను సులభతరం చేసే లక్ష్యంతో విభిన్న సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకొచ్చింది. ఆహారం ఆర్డర్ చేయడం నుంచి నిత్యావసర సరుకులు తెప్పించుకోవడం వరకు, ప్రయాణాల కోసం క్యాబ్‌లు బుక్ చేసుకోవడం నుంచి హోటళ్లు, రిసార్టులు రిజర్వ్ చేసుకోవడం వరకు అనేక సౌకర్యాలను ఒకే యాప్ ద్వారా పొందేలా రూపొందించారు. కాగా.. టుగెదర్ ఫర్ ఏ స్మార్టర్ టుమారో అనే సందేశంతో ముందుకొచ్చిన జుఒన్ యాప్ ద్వారా అనేక సేవలను అందించే సూపర్ యాప్ విభాగంలో తనదైన గుర్తింపు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


