
దసరా వచ్చిందంటే ఆయుధపూజ చేయాల్సిందే! ఇంట్లో ఉన్న బండిని తళతళా మెరిసేట్టు శుభ్రంగా కడిగి పూజ చేసి దిష్టి తీయాల్సిందే! కమెడియన్ వైవా హర్ష (Harsha Chemudu) కూడా అదే చేశాడు. తన కార్లు, బైకులన్నింటినీ శుభ్రంగా కడిగి దండవేసి ఇంటి ముందు రెడీగా పెట్టాడు. భార్యతో కలిసి వాహనపూజ చేశాడు. ఈ మేరకు పలు ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.
ఫ్యామిలీ త్యాగాలు
ఆయుధపూజ చేయడానికి ఏడాదంతా ఎదురుచూస్తాం. ఇవన్నీ చేయటానికి ఎంతో కష్టపడతాం. ఆటోమొబైల్స్ మీద నాకున్న ఇష్టాన్ని అర్థం చేసుకుని, నేను ఎన్ని వాహనాలు కొంటున్నా అడ్డు చెప్పని ఫ్యామిలీకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ల త్యాగాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఎప్పుడూ వాటి గురించి మాట్లాడరు. ఎందుకంటే నేను బాధపడకూడదన్నదే వాళ్ల కోరిక. అలాగే ఇది నా చిన్ననాటి కల.
నా ఇంటినిండా అవే..
చిన్నప్పుడు కార్లు, బైకులంటూ వాటి ఫోటోలతో నా గదినంతా నింపేసేవాడిని. ఎక్కడ చూసినా వాటి స్టిక్కర్లే ఉండేవి. నా పాకెట్‌మనీలో కొంత డబ్బు దాచుకుని దానితో ఆటోమొబైల్స్ మ్యాగజైన్లు కొనుక్కునేవాడిని. కొద్దిరోజుల్లోనే అది పూర్తిగా చదివేసి.. మళ్లీ తర్వాతి నెల మ్యాగజైన్ కోసం ఎదురుచూసేవాడిని. అలా నా చిన్నప్పుడు నేను ఇష్టపడ్డ వాహనాలను సేకరిస్తున్నాను. ఒక్కొక్కటిగా అన్నీ కొనుక్కుంటూ పోతున్నాను. అందుకే నా దగ్గర ఇన్ని బైక్స్ ఉన్నాయి.
మీ వల్లే ఇదంతా..
మీ సపోర్ట్ లేకుంటే ఇవన్నీ కొనగలిగేవాడినే కాదు. నన్ను మీలో ఒకడిగా చూసుకుంటున్నందుకు చాలా చాలా థాంక్స్. నా ప్రతి విజయంలో మీ భాగస్వామ్యం ఉంది. మీవల్లే నేనిక్కడ ఉన్నాను. మీవల్లే నా కలల్ని సాకారం చేసుకోగలుగుతున్నాను అని రాసుకొచ్చాడు. వైవా హర్ష.. ఈ ఏడాది వచ్చిన గేమ్ ఛేంజర్, తండేల్, సారంగపాణి జాతకం, జూనియర్, బకాసుర రెస్టారెంట్ చిత్రాల్లో మెరిశాడు.
చదవండి: రావణుడు కొంటెవాడు కానీ రాక్షసుడు కాదు: బాలీవుడ్ నటి