
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటున్న కన్నప్ప నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లోనే ఉంది. రుద్ర పాత్రలో ప్రభాస్(Prabhas) నటిస్తున్నాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అందరు అనుకున్నట్లుగా ఈ సినిమాను ప్రభాసే నిలబెట్టేవాడు.
( చదవండి: కన్నప్ప మూవీ రివ్యూ)
ఈ సినిమాలో ఆయన కనిపించేది 20 నిమిషాలే అయినా.. ఆ సన్నివేశాలే సినిమాలకు కీలకం. సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. రుద్ర పాత్ర తెరపై కనిపించగానే థియేటర్స్‌లో విజిల్స్ పడతాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే ఆయన ఎంట్రీ గ్రాండ్‌గా ఉంటుంది. ఇక ఆయన చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి. తిన్నడుతో పాటు నెమలితో రుద్ర చేసే కామెడీ సంభాషణనలు ఆకట్టుకుంటాయి.
రుద్ర పాత్రకు ప్రభాస్‌ని తప్ప వేరే హీరోని ఊహించుకోలేమని సినిమా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. . ఇక మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో మహాదేవ శాస్త్రిగా అద్భుత నటన కనబరిచాడు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ చక్కగా చేసింది. మంచు విష్ణు కూడా తన కెరీర్‌లో బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో విష్ణు నటన అందరినీ ఆకట్టుకుంటుంది.