‘కన్నప్ప’ మూవీ రివ్యూ | Kannappa Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ హిట్టా? ఫట్టా?

Jun 27 2025 1:24 PM | Updated on Jun 28 2025 1:25 PM

Kannappa Movie Review And Rating In Telugu

టైటిల్‌ : కన్నప్ప
నటీనటులు: విష్ణు మంచు, మోహన్‌ బాబు, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, ప్రీతి ముకుందన్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం తదితరులు
నిర్మాణ సంస్థ: ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నిర్మాత: మోహన్‌ బాబు
కథ:పరుచూరి గోపాల కృష్ణ,ఈశ్వర్ రెడ్డి, జి. నాగేశ్వర రెడ్డి
తోట ప్రసాద్
దర్శకత్వం: ముకేశ్‌ కుమార్‌ సింగ్‌
సంగీతం : స్టీఫెన్‌ దేవస్సీ
సినిమాటోగ్రఫీ: షెల్డన్‌ చౌ
ఎడిటర్‌: ఆంథోనీ
విడుదల తేది: జూన్‌ 27, 2025

Vishnu Manchu Kannappa Movie HD Stills1

కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కథకుడిగా, నిర్మాతగాను వ్యవహరించాడు. మంచు ఫ్యామిలికి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించాయి. అలాగే ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌ లాంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్‌, ట్రైలర్‌ వచ్చాక ఈ సినిమాపై ఉన్న నెగెటివిటీ తగ్గిపోయింది. ప్రమోషన్స్‌ గట్టిగా చేయడంతో హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్‌ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(Kannappa Movie Review).

Vishnu Manchu Kannappa Movie HD Stills11

కథేంటంటే..
తిన్నడు(మంచు విష్ణు) పరమ నాస్తికుడు. అతని తండ్రి నాథ నాథుడు(శరత్‌ కుమార్‌) మాటే ఆయనకు వేదం. గూడెం ప్రజలకే ఏ కష్టం వచ్చినా ముందుంటాడు.  పక్క గూడానికి చెందిన యువరాణి నెమలి(ప్రీతీ ముకుందన్‌)తో ప్రేమలో పడతాడు. ఓసారి గూడెంలో ఉన్న వాయు లింగం కోసం వచ్చిన   కాల ముఖుడు (అర్పిత్ రాంకా) సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు. 

ఈ విషయం కాల ముఖుడికి తెలిసి.. గూడెంపై దండయాత్రకు బయలుదేరుతాడు. అదే సమయంలో ఓ కారణంగా తిన్నడు గూడాన్ని వీడాల్సి వస్తుంది.  నెమలితో కలిసి అడవికి వెళ్తాడు.  శివుడి పరమభక్తురాలైన నెమలి.. దేవుడినే నమ్మని తిన్నడు కలిసి జీవితం ఎలా సాగించాడు? వీరి జీవితంలోకి రుద్ర(ప్రభాస్‌) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయు లింగం కోసం కాల ముఖుడు ఎందుకు వెతుకుతున్నాడు? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడు పరమ భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Vishnu Manchu Kannappa Movie HD Stills17

ఎలా ఉందంటే.. 
కన్నప్ప కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పరమ నాస్తికుడైన తిన్నడు పరమ భక్తుడిగా ఎలా మారాడు అనేది 50 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘భక్త కన్నప్ప’ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అదే  కథతో ఇప్పుడు మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.  ఓ భక్తి కథకు కావాల్సినంత కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ ను నేటి తరానికి నచ్చేలా ‘కన్నప్ప’ కథను చెప్పాలనుకున్నారు. ఈ విషయంలో మంచు విష్ణుని అభినందించాల్సిందే. అయితే టెక్నికల్‌గా సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. సీజీ వర్క్‌ పేలవంగా ఉంది.  వార్‌ సీన్స్‌ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.  అయితే ఎమోషన్‌ని తెరపై బాగా పండించి ఆ లోపాలను కాస్త కప్పిపుచ్చారు. భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగా హ్యాండిల్‌ చేశాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమా చాలా ఎమోషనల్‌గా సాగుతూ.. శివ భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

Vishnu Manchu Kannappa Movie HD Stills30

శివుడు గొప్పతనాన్ని పాట రూపంలో చెబుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు.  ఆ తర్వాత తిన్నడు ఎందుకు నాస్తికుడిగా మారాల్సి వచ్చిందో అర్థవంతంగా చూపించారు.  మంచు విష్ణు ఎంట్రీ కథనం ఆసక్తి పెరుగుతుంది. యువరాణి నెమలితో ప్రేమలో పడడం.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌ని ఆకట్టుకుంటాయి.  పాటల పేరుతో భక్తి చిత్రంలోనూ శృంగార రసాన్ని బాగానే పండించారు. కొన్ని చోట్ల ఆ శృంగార రసం మితిమీరిపోయింది కూడా. 

ఇక మోహన్‌ బాబు ఎంట్రీ, మోహన్‌ లాల్‌ ఎంట్రీ సీన్స్‌ అదిరిపోతాయి.  అయితే ఫస్టాఫ్‌లో వచ్చే యుద్ద సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.  ఓవరాల్‌గా ఫస్టాఫ్‌ పర్లేదులే అన్నట్లుగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం పరుగులు పెడుతుంది. ముఖ్యంగా రుద్రగా ప్రభాస్‌ ఎంట్రి ఇచ్చిన తర్వాత కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ప్రభాస్‌ కనిపించేది 20 నిమిషాలే అయినా..  ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోతారు.  క్లైమాక్స్‌లో విష్ణు నటన ఆకట్టుకుంటుంది. శివ భక్తులకు చివరి 40 నిమిషాలు అయితే విపరీతంగా నచ్చుతుంది. 

Vishnu Manchu Kannappa Movie HD Stills6

ఎవరెలా చేశారంటే.. 
తిన్నడు అలియాస్‌ కన్నప్పగా మంచు విష్ణు బాగా నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో విష్ణు నటన అదిరిపోతుంది. ఆయన కెరీర్‌లో బెస్ట్‌ ఫెర్పార్మెన్స్‌గా కన్నప్ప నిలిచిపోతుంది.  

గూడెపు యువరాణి, శివుడి పరమ భక్తురాలు నెమలిగా ప్రీతి ముకుందన్‌ మంచి నటనతో ఆకట్టుకుంది. తెరపై కావాల్సినంత అందాలను ప్రదర్శిస్తూనే.. నటన పరంగాను మంచి మార్కులే సంపాదించుకుంది. విష్ణు, ప్రీతీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది.  Vishnu Manchu Kannappa Movie HD Stills2

ఇక రుద్రగా ప్రభాస్‌ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తెరపై కనిపించేది 20 నిమిషాలే అయినా.. అవే సినిమాకు కీలకంగా మారుతాయి.  తిన్నడు, నెమలితో పాటు మహాదేవ శాస్త్రీ పాత్రలకు రుద్రకు మధ్య వచ్చే సీన్స్‌ అదిరిపోతాయి.  ఆయన చెప్పే డైలాగ్స్‌ థియేటర్స్‌లో విజిల్స్‌ వేయిస్తాయి. 

ఇక శివుడికి తనకంటే గొప్ప భక్తుడు లేడని భావించే మహాదేవ శాస్త్రీగా మోహన్‌బాబు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన డైలాగు డెలివరీ  ఆ పాత్రకు హుందాతనం తెచ్చింది. 

Vishnu Manchu Kannappa Movie HD Stills18

మోహన్‌లాల్‌ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శివుడి పాత్రలో అక్షయ్‌ కుమార్‌,  పార్వతీదేవి పాత్రలో కాజల్‌ ఒదిగిపోయారు. 

Vishnu Manchu Kannappa Movie HD Stills5

ఇక తిన్నడు తండ్రిగా శరత్‌కుమార్‌ నటన బాగుంది. కానీ, ఓన్‌ వాయిస్‌తో చెప్పిన డబ్బింగ్‌ బాగోలేదు. చిన్నప్పటి తిన్నడుగా నటించిన అవ్రామ్‌.. నటన పరంగా ఓకే కానీ డబ్బింగ్‌ దారుణంగా ఉంది. తెలుగు పదాలు సరిగా పలకలేకపోయాడు. బ్రహానందం, మధుబాల, శివబాలాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

సాకేంతికంగా సినిమా బాగుంది. స్టీఫెన్‌ దేవస్సీ పాటలు  పర్వాలేదు కానీ నేపథ్య సంగీతమే అంతగా బాగోలేదు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలను గుర్తు చేసేలా బీజీఎం ఉంది. షెల్డన్‌ చౌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.  న్యూజిలాండ్‌ అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు బాగుంది.  ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌ 

Rating:

What's your opinion?

‘కన్నప్ప’ మూవీ ఎలా ఉంది?

Choices
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement