
ప్రభాస్ మంచితనం గురించి అందరికి తెలిసిందే. సాయం కోరి వస్తే.. తనకు సాధ్యమైనంతవరకు చేస్తాడని ఆయనను దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు. తన వల్ల ఒక సినిమాకు హెల్ప్ అవుతుందని చెబితే.. ‘స్టార్’ హోదాని సైతం పక్కకు పెట్టి వస్తాడని ‘కన్నప్ప’తో నిరూపించాడు.
(చదవండి: నా కుటుంబాన్ని నిలబెట్టారు, నాలో భయాన్ని చంపేశారు: మనోజ్ భావోద్వేగం)
ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌కి ‘కన్నప్ప’లోని రుద్ర పాత్ర చాలా చిన్నదనే చెప్పాలి. కానీ మోహన్ బాబు, మంచు విష్ణుల కోసం ప్రభాస్ ఆ పాత్ర ఒప్పుకున్నాడు. ప్రభాస్ కనిపించినంత సేపు థియేటర్స్ ఊగిపోయాయి. ఆయన ఉండడం వల్లే కన్నప్ప తొలి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టగలిగింది. అయితే ఈ చిత్రానికి ప్రభాస్ కూడా ఒక్క రూపాయి పారితోషికంగా తీసుకోకపోవడం గమనార్హం. ప్రభాస్ స్థానంలో మరో ఏ హీరో ఉన్నా.. ఇలా ఒప్పుకునేవారు కాదేమో. ఈ విషయాన్ని మంచు విష్ణు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు
(చదవండి: రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన మిరాయ్.. తేజ కెరీర్‌లోనే అత్యధికం..)
అలా కన్నప్పతో మంచు విష్ణుకి తోడుగా నిలిచిన ప్రభాస్.. ఇప్పుడు ‘మిరాయ్’తో తమ్ముడు మనోజ్‌కి అండగా నిలిచాడు. తేజ సజ్జ, మనోజ్ నటించిన ఈ చిత్రానికి ప్రభాస్ గాత్రదానం చేశాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన చిత్ర యూనిట్..రిలీజ్‌కి కొన్ని గంటల ముందు అఫిషియల్‌గా ప్రకటించింది. ప్రభాస్ వాయిస్ ఓవర్‌కి థియేటర్స్ దద్దరిల్లిపోతుండగా, సోషల్ మీడియా ఊగిపోతుంది.
ఇలా అటు కన్నప్ప, ఇటు మిరాయ్ చిత్రాలకు తనవంతు సాయం అందించి, మంచు బ్రదర్స్‌కి రెబల్ స్టార్ అండగా నిలిచాడు. ఇదే విషయాన్ని మిరాయ్ సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్ గుర్తు చేస్తూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ‘మా అన్నదమ్ములకు సపోర్ట్‌గా నిలబడినందుకు థ్యాంక్యూ సో మచ్ డార్లింగ్’ అంటూ ప్రభాస్‌కి కృతజ్ఞతలు తెలిపాడు.