హనుమాన్‌ రికార్డు బద్ధలు కొట్టిన మిరాయ్‌! ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే? | Teja Sajja Mirai Movie First Day Collection | Sakshi
Sakshi News home page

Mirai Movie: బాక్సాఫీస్‌ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతంటే?

Sep 13 2025 11:23 AM | Updated on Sep 13 2025 12:07 PM

Teja Sajja Mirai Movie First Day Collection

ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో గ్రాఫిక్స్‌ ఉపయోగిస్తున్నారు. ఈ వీఎఫ్‌ఎక్స్‌ కోసం వందల కోట్లు గుమ్మరించేస్తున్నారు. దాంతో బడ్జెట్‌ తడిసిమోపెడవుతోంది. దానికి తగ్గట్లుగా కలెక్షన్స్‌ రాబట్టడం గగనమవుతోంది. కానీ మిరాయ్‌ (Mirai Movie) మాత్రం తక్కువ బడ్జెట్‌తోనే అద్భుతాలు సృష్టించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ మిరాయ్‌. హీరోయిన్‌గా రితికా నాయక్‌, విలన్‌గా మంచు మనోజ్‌, హీరో తల్లిగా శ్రియ నటించారు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.

ఫస్ట్‌డే కలెక్షన్స్‌
సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. తొలిరోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.12 కోట్లకుపైగా నెట్‌ కలెక్షన్స్‌ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది హనుమాన్‌ కంటే కూడా ఎక్కువని తెలుస్తోంది! తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్‌ మూవీ మొదటిరోజు దేశవ్యాప్తంగా దాదాపు రూ. 10 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టింది. ఈ రికార్డును మిరాయ్‌ బద్ధలు కొట్టింది. మిరాయ్‌.. నార్త్‌ అమెరికాలో 7 లక్షల డాలర్లు (రూ.6 కోట్లపైనే) వసూలు చేసినట్లు చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. వీకెండ్‌లో ఈ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

 

 

 

చదవండి: ఇమ్మాన్యుయేల్‌పై మాస్క్‌ మ్యాన్‌ దారుణ కామెంట్స్‌.. బాడీ షేమింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement