అందుకే జ్యోతిర్లింగాలను సందర్శించాం: మంచు విష్ణు | Manchu Vishnu About Kannappa Movie | Sakshi
Sakshi News home page

అందుకే జ్యోతిర్లింగాలను సందర్శించాం: మంచు విష్ణు

Oct 26 2024 3:08 AM | Updated on Oct 26 2024 3:08 AM

Manchu Vishnu About Kannappa Movie

‘‘పరమ శివుడి పరమ భక్తుడి కథగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. అందుకే ఈ చిత్రం విడుదలకు ముందే 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేష్‌కు రావడం ఆనందంగా ఉంది. మా ఎపిక్‌ యాక్షన్‌ చిత్రమైన ‘కన్నప్ప’ విడుదల కోసం యూనిట్‌ అంతా ఎదురుచూస్తున్నాం’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా ‘కన్నప్ప’ చిత్రయూనిట్‌ పన్నెండు జ్యోతిర్లింగాల సందర్శన యాత్రను చేపట్టింది. రిషికేశ్‌ సందర్శనతో వారి ప్రయాణం ముగిసింది. ఈ యాత్రలో మోహన్‌బాబు, విష్ణు, ముఖేష్‌ కుమార్‌ సింగ్, నటుడు అర్పిత్‌ రంకా పాల్గొన్నారు. ‘‘ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ వంటి ఇతిహాసాల స్ఫూర్తితో ‘కన్నప్ప’ రూపొందింది. భక్తి, శౌర్యం, ఆధ్యాత్మిక అన్వేషణతో కూడిన ప్రయాణంగా ఈ మూవీ ఉంటుంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్‌ కుమార్, మోహన్‌బాబు, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్, బ్రహ్మానందం, కాజల్‌ అగర్వాల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement