'అప్పటిదాకా కన్నప్ప ఓటీటీకి రాదు..' మంచు విష్ణు క్లారిటీ! | Manchu Vishnu Reveals Kannappa Ott Release Update | Sakshi
Sakshi News home page

Kannappa Ott: అప్పటి వరకు ఓటీటీలో రాదు.. కన్నప్పపై మంచు విష్ణు‘

Jun 27 2025 5:43 PM | Updated on Jun 27 2025 6:28 PM

Manchu Vishnu Reveals Kannappa Ott Release Update

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో భారీ అంచనాల మధ్య జూన్ 27న ప్రపంచవ్యాప్తందా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే కన్నప్పకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రభాస్‌.. రుద్ర పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ ‍అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్ రావడంతో ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అయితే రిలీజ్‌ ముందు రోజు మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు కన్నప్ప గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు. ఈ మూవీని ఓటీటీకి ఎప్పుడు తీసుకొస్తారని ప్రశ్నించగా.. ఆయన సమాధానామిచ్చారు. నా సినిమా 10 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుందని స్పష్టం చేశారు. రిలీజ్ విషయంలో నాపై ఒత్తిడి లేదని చెప్పారు. అందుకే కన్నప్పను పది వారాల తర్వాతే ఓటీటీకి తీసుకొస్తామని వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement