మంచు విష్ణు కన్నప్ప.. మరో రెండు పాత్రలు రివీల్ | Manchu Vishnu Kannappa Team Revealed another Two Roles In This Movie | Sakshi
Sakshi News home page

Kannappa Movie: మల్లుగా రఘుబాబు.. శివబాలాజీ ఏ పాత్రలో కనిపిస్తారంటే?

Published Tue, Mar 25 2025 7:30 PM | Last Updated on Tue, Mar 25 2025 7:54 PM

Manchu Vishnu Kannappa Team Revealed another Two Roles In This Movie

టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. ఇప్పటికే రిలీజైన కన్నప్ప పోస్టర్లు, టీజర్లు, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం కన్నప్ప మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో రెండు పాత్రలను రివీల్ చేశారు. రఘుబాబు, శివబాలాజీ పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ పోస్టర్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.  ఈ చిత్రంలో రఘు బాబు మల్లు అనే ఓ పాత్రను పోషిస్తుండగా.. శివబాలాజీ కుమారదేవ శాస్త్రిగా కనిపించనున్నారు.

కాగా.. ఈ చిత్రంలో శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్‌, రుద్రుడిగా ప్రభాస్‌, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు కన్నప్ప టీం సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement