క్యాలెండర్‌ మార్క్ చేస్కోండి.. దొంగప్ప వచ్చేస్తున్నాడు: మంచు మనోజ్‌ ట్వీట్ | Tollywood Hero Manchu Manoj Tweet On kannappa Movie | Sakshi
Sakshi News home page

Manchu Manoj: దొంగప్ప రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు?.. మంచు మనోజ్ వ్యంగ్యాస్త్రం

Apr 10 2025 7:27 PM | Updated on Apr 10 2025 7:41 PM

Tollywood Hero Manchu Manoj Tweet On kannappa Movie

మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కొద్ది నెలలు సైలెంట్‌గా ఉన్న మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. మంచు మనోజ్‌ మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. తన కూతురి బర్త్‌ డే సెలబ్రేట్ చేసుకునేందుకు జైపూర్‌ వెళ్లగా.. తన కారుతో పాటు తమ వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జల్‌పల్లిలోని మోహన్‌ బాబు ఇంటి వద్ద నిరసన చేపట్టారు.

మరోవైపు మంచు విష్ణు మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి కన్నప్ప మూవీ గురించి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే మంచు మనోజ్ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కన్నప్ప మూవీని ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్‌ నెట్టింట వైరలవుతోంది. 

తన సినిమాకు భయపడే కన్నప్ప సినిమాను వాయిదా వేసుకున్నారని ఇప్పటికే మంచు మనోజ్ ఆరోపించారు. ఇవాళ ఏకంగా కన్నప్ప మూవీని దొంగప్ప అంటూ జూన్ 27న బిగ్‌ స్క్రీన్‌పైకి రాబోతోందని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఇంతకీ రిలీజ్ తేదీ జూలై 17న.. లేదా జూన్‌ 27నా అంటూ ఎగతాళి చేశారు. వందకోట్లకు పైగా బడ్జెట్‌ మూవీ కదా.. మీ పీఆర్ ప్లానింగ్ కేక అంటూ మంచు మనోజ్‌ తన ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం సరదా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement