కన్నప్ప తీసింది వాళ్ల కోసమే.. కక్కుర్తి పడి కాదు: మంచు విష్ణు | Manchu Vishnu Responds On Kannappa Movie Ticket Price Hike | Sakshi
Sakshi News home page

Kannappa Movie: వాటి రేట్లు తగ్గిస్తేనే.. టికెట్ ధర పెంచడానికి ఆలోచిస్తా: మంచు విష్ణు

Jun 26 2025 5:18 PM | Updated on Jun 26 2025 6:19 PM

Manchu Vishnu Responds On Kannappa Movie Ticket Price Hike

సినిమా టికెట్ రేట్ల పెంపుపై మంచు విష్ణు స్పందించారు. కన్నప్ప మూవీ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తన సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడాలని.. వాళ్లను ఇబ్బందిపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. అందుకే  టికెట్ రేట్లు పెంచలేదని అన్నారు. తెలంగాణలో టికెట్లకు ఎలాంటి పెంపు లేదని తెలిపారు. ఏపీలో కూడా కేవలం కొన్ని సెంటర్లలో మాత్రమే పెంపు ఉంటుదని మంచు విష్ణు వెల్లడించారు.

అమెరికాలో సైతం కన్నప్ప ప్రీమియర్ షోలకు కేవలం 16 డాలర్లుగా మాత్రమే నిర్ణయించామని మంచు విష్ణు వెల్లడించారు. ఆ తర్వాత పెద్దవారికి 14 డాలర్లు, పిల్లలకు 12 డాలర్లుగా టికెట్ ధరలు ఉన్నాయని తెలిపారు. ఏ రోజు అయితే పాప్‌కార్న్, కోక్  ధరలు తగ్గిస్తారో ఆ రోజు నుంచి నేను మల్టీప్లెక్స్‌లో టికెట్స్ పెంచడానికి ఆలోచిస్తానని అన్నారు. అంతే తప్పా నా కక్కుర్తి కోసం టికెట్ రేట్స్ పెంచడం లేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను పిల్లలు ఎక్కువగా చూడాలన్నదే తన కోరిక అని తెలిపారు. నా చిన్నప్పుడు రామాయణ, మహభారతం గురించి నేను టీవీల్లో చూసేవాడిని.. మన చరిత్ర, దేవుళ్ల గురించి సినిమాలు, కామిక్ బుక్ కల్చర్ ద్వారే తనకు తెలిసిందన్నారు. పిల్లలకు కూడా ఈ సినిమా నచ్చాలనే ఉద్దేశంతోనే కథను తీశామని విష్ణు స్పష్టం చేశారు.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం కన్నప్ప.  ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement