‘కన్నప్ప’ కామిక్‌ మూడో ఎపిసోడ్‌ రిలీజ్‌! | Kannappa Animated Comic Book Final Chapter Released | Sakshi
Sakshi News home page

‘కన్నప్ప’ కామిక్‌ మూడో ఎపిసోడ్‌ రిలీజ్‌!

May 16 2025 2:29 PM | Updated on May 16 2025 2:57 PM

Kannappa Animated Comic Book Final Chapter Released

మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్‌ హీరోయిన్‌గా నటించగా, ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌లు, పాటలు పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. యూఎస్‌లో విష్ణు మంచు స్టార్ట్ చేసిన కన్నప్ప ప్రమోషనల్ టూర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కన్నప్ప కథను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కామిక్ బుక్స్ రూపంలోకి విష్ణు మంచు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

కామిక్ సిరీస్‌లోని మొదటి రెండు ఎపిసోడ్‌లకు అఖండ స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడో అధ్యాయాన్ని విడుదల చేశారు. ఈ చివరి ఎపిసోడ్ తిన్నడు భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను సూచిస్తుంది. అతను ఒకప్పుడు దైవత్వం ఆలోచనను తిరస్కరిస్తాడు.. కానీ చివరికి శివుని భక్తుడిగా మారుతాడు. కన్నప్పగా మారడానికి అతని అద్భుతమైన ప్రయాణాన్ని ఈ మూడో అధ్యాయం వివరిస్తుంది. భక్తి, ప్రేమ, త్యాగం, విధితో నిండిన ఈ కథ అందరినీ ఆకట్టుకుంటుంది.

ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ విజువల్స్, వీడియో అందరినీ అబ్బుర పరిచేలా ఉంది. ఇంతకు మించి అనేలా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీం చెబుతోంది. విజువల్ ఎఫెక్ట్స్‌లో జాప్యం వల్లే ఈ మూవీని జూన్ 27కి వ్యూహాత్మకంగా మార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement