Upcoming Tollywood Movies: జూన్‌లో పెద్ద సినిమాల జాతర.. గ్యాపే లేదు! | Here's The List Of Tollywood Big Movies Releasing In June 2025, Hari Hara Veera Mallu And Kannappa In List | Sakshi
Sakshi News home page

ఈ నెల థియేటర్స్‌లో విడుదలయ్యే చిత్రాలివే.. అన్నీ పెద్ద సినిమాలే!

Jun 3 2025 12:22 PM | Updated on Jun 3 2025 1:49 PM

List Of Tollywood Films Releasing In June 2025

టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత సమ్మర్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవి కాలం వృథాగా పోయింది. మే నెలలో పెద్ద సినిమాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. వచ్చిన వాటిలో హిట్‌ 3 చిత్రం ఒక్కటే కాస్త బెటర్‌గా ఆడింది. సమంత ‘శుభం’, శ్రీ విష్ణు ‘సింగిల్‌’ లాంటి చిత్రాలు కొంతమేర ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇలా సమ్మర్‌కి కీలకమైన మే నెల టాలీవుడ్‌ని పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. 

కానీ అనూహ్యంగా జూన్‌ నెల టాలీవుడ్‌కి కీలకంగా మారబోతుంది. ఈ నెలలో వారానికొక పెద్ద సినిమా రిలీజ్‌ కానుంది. వాటిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కమల్‌ హాసన్‌ ‘థగ్‌ లైఫ్‌’తో ఈ నెల టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ఓపెన్‌ కాబోతుంది. ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దశాబ్దాల తర్వాత మణిరత్నం, కమల్‌ కాంబోలో వస్తున్న చిత్రమిది. శింబు కీలక పాత్ర పోషించారు. కోలీవుడ్‌లో మాదిరే టాలీవుడ్‌లోనూ భారీ ప్రమోషన్స్‌ చేశారు. కమల్‌ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దీంతో థగ్‌ లైఫ్‌పై తెలుగులోనూ మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. జూన్‌ 5న రిలీజ్‌ కానున్న ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

ఇక థగ్‌ లైఫ్‌ వచ్చిన వారానికే పవన్‌ కల్యాణ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్‌ 12న రిలీజ్‌ కాబోతుంది. చాలా రోజుల తర్వాత పవన్‌ నుంచి వస్తున్న చిత్రమిది. అంతేకాదు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్‌ కాబోతున్న తొలి సినిమా.దీనిపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

ఎప్పుడైన ఒక పెద్ద సినిమా రిలీజ్‌ అయిందంటే.. మరుసటి వారం కాస్త గ్యాప్‌ ఉండేది. లేదంటే చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవి. కానీ ఈ సారి పవన్‌ సినిమాకు కూడా పోటీ ఎదురైంది. హరిహర వీరమల్లు వచ్చిన మరుసటి వారమే(మే 20) ధనుష్‌-నాగార్జునల ‘కుబేర’ రిలీజ్‌ కానుంది. శేకర్‌ కమ్ముల దర్శకత్వం వహి​ంచిన ఈ చిత్రంపై కూడా ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్‌లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అదే రోజు ఆమిర్‌ ఖాన్‌ సితారే జమీర్‌పర్‌ రిలీజ్‌ కాబోతుంది.

ఇక జూన్‌ చివరివారంపై ‘కన్నప్ప’ కర్ఛీఫ్‌ వేశాడు. మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఇది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు విష్ణు. చెన్నై, బెంగళూరు, ముంబై తదితర పట్టణాలలో ప్రమోషన్స్‌ ఈవెంట్స్‌ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 27న ఈ చిత్రం రిలీజ్‌ కాబోతుంది. ఇలా జూన్‌ నెలలో ప్రతి వారం ఒక్కో పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటు గ్యాంబ్లర్స్‌(జూన్‌ 6), 8 వసంతాలు (జూన్‌ 20), మర్గాన్‌ (జూన్‌ 27) చిత్రాలు కూడా ఈ నెలలోనే రిలీజ్‌ కానున్నాయి. మరి వీటిల్లో ఏ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలుస్తుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement