
విష్ణు మంచు హీరోగా నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మోహన్‌బాబు, ఆర్.శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.
ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా అమెరికా ప్రమోషన్ టూర్‌లో బిజీగా ఉన్నారు విష్ణు మంచు. కాగా ఈ సినిమాలోని మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌లకు తాను స్టంట్ కొరియోగ్రాఫర్‌గా చేసిన విషయాన్ని విష్ణు మంచు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ‘‘మార్షల్ ఆర్ట్స్‌లో నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. లాస్ ఏంజిల్స్‌లో స్టంట్ మేన్‌గా వర్క్ చేశాను. తెలుగు స్టంట్ యూనియన్ సభ్యుడిగా కూడా నేను గర్వపడుతున్నాను.
ఇదంతా నేను యాక్టర్ కాకముందే చేశాను. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ‘కన్నప్ప’ సినిమాకు షో రన్నర్‌గా చేస్తూనే, ఈ సినిమాలోని చాలా యాక్షన్ సీక్వెన్స్‌లను నేనే డిజైన్ చేశాను. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రాణంపోసిన కెచా మాస్టర్‌కు ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు విష్ణు మంచు. అలాగే ‘కన్నప్ప’ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌ల మేకింగ్ వీడియోను కూడా షేర్ చేశారు విష్ణు మంచు.