కన్నప్పలో ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌.. రచ్చ లేపిన ఫ్యాన్స్‌ | Prabhas And Manchu Vishnu Interesting Scene About Wedding In Kannappa Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

పెళ్లంటే పరుగు తీస్తున్న ప్రభాస్‌.. కన్నప్ప సినిమాలోనూ అదే తీరు!

Jun 28 2025 10:11 AM | Updated on Jun 28 2025 11:21 AM

Kannappa Movie: Prabhas, Manchu Vishnu Talks about Wedding

కొందరు పెళ్లి పేరు ఎత్తితేనే పారిపోతుంటారు. అందులో డార్లింగ్‌ ప్రభాస్‌ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి ముచ్చటే లేదు. ఈ ఏడాదే ప్రభాస్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పడుతుందంటూ ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపించినా అవన్నీ ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. డార్లింగ్‌ జీవితంలోకి రాబోయే అమ్మాయి ఎక్కడుందో? ఏంటో? లక్కీ గర్ల్‌ అని అభిమానులు సరదాగా అనుకుంటూ ఉంటారు. 

పెళ్లంటే ముఖం చాటేస్తున్న హీరో
అయితే ఎవరెన్ని అనుకున్నా.. వయసు మీద పడుతున్నా సరే.. ప్రభాస్‌ మాత్రం పెళ్లంటేనే నాలుగడుగులు వెనకడుగు వేస్తున్నాడు. వయసు దాటిపోతున్నా.. లెక్క చేయడం లేదు. రియల్‌ లైఫ్‌లోనే కాదు రీల్‌ లైఫ్‌లో కూడా ఇదే జరిగింది. కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో కనిపించాడు ప్రభాస్‌. ఓ సీన్‌లో తిన్నడు(విష్ణు).. రుద్ర(ప్రభాస్‌)ను నీకు పెళ్లయిందా? అని అడుగుతాడు. అందుకు రుద్ర.. నా పెళ్లి గురించి నీకెందుకులే.. అని కౌంటరిచ్చాడు. అప్పుడు విషయం అర్థమైన తిన్నడు.. పెళ్లి చేసుకుంటే తెలిసేది అని డైలాగ్‌ విసురుతాడు. ఈ సంభాషణకు థియేటర్‌లో చప్పట్లు, విజిల్స్‌ గట్టిగానే పడ్డాయి. ప్రభాస్‌ అభిమానుల అరుపులతో థియేటర్‌ దద్దరిల్లిపోతోంది.

కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. విష్ణు ప్రధాన పాత్రలో నటించాడు. అక్షయ్‌ కుమార్‌, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రలు పోషించారు. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చదవండి: రెండో బిడ్డ జననం.. ఫోటో షేర్‌ చేసిన ఇలియానా

Advertisement
 
Advertisement
Advertisement