
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన 'కన్నప్ప' (Kannappa) సెప్టెంబర్ 4న ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. అయితే, అనుకున్న సమయానికి స్ట్రీమింగ్కు రాకపోడంతో నెటిజన్లు పోస్టులు షేర్ చేశారు. దీంతో కాస్త ఆసల్యంగా ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్ వంటి స్టార్స్ నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది.
'కన్నప్ప' సెప్టెంబర్ 4నుంచి స్ట్రీమింగ్కు రానున్నట్లు సోషల్మీడియా ద్వారా మంచు విష్ణు ప్రకటించారు. అయితే, ఈ చిత్రం మొదట అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రాకపోడంతో నెటిజన్లు సదరు ఓటీటీ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. దీంతో కాస్త ఆలస్యంగా కన్నప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. ఈ క్రమంలో మరో పోస్టర్‌ను విడుదల చేశారు. థియేటర్‌లో చూడనివారు ఈ వీకెండ్‌లో చూసేయండి.