మంచు విష్ణు కుమారుడి సినీ ఎంట్రీ.. ఫస్ట్‌ లుక్‌ చూశారా? | Manchu Vishnu Son Avram Movie Entry with Bhaktha Kannappa Movie | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: సినిమాల్లోకి మంచు విష్ణు కుమారుడు.. కన్నప్పలో ఏ పాత్ర అంటే?

Aug 26 2024 10:42 AM | Updated on Aug 26 2024 11:17 AM

Manchu Vishnu Son Avram Movie Entry with Bhaktha Kannappa Movie

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని సెట్‌ చేశాడు విష్ణు. సౌత్‌ నుంచి నార్త్‌ దాకా పేరుమోసిన యాక్టర్స్‌ అందరినీ ఈ ప్రాజెక్టులో భాగం చేశాడు. తన కుమారుడు సైతం సినిమాలో ఉన్నట్లు వెల్లడించాడు. నేడు (ఆగస్టు 26) శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కన్నప్ప నుంచి అవ్రమ్‌ మంచు ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశాడు. ఇందులో అవ్రమ్‌.. తిన్నడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ తిన్నడే పెద్దయ్యాక భక్త కన్నప్పగా కీర్తి గడించాడు.

మాటలు రావట్లేదు
ఈ సందర్భంగా విష్ణు సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ అయ్యాడు.. కన్నప్పలో అవ్రమ్‌ లుక్‌ లాంచ్‌ చేసినందుకు గర్వంగా ఉంది. ఈ ప్రపంచానికి తను నటుడిగా పరిచయం అవుతున్నందుకు మాటలు రావడం లేదు అని పేర్కొన్నాడు. సినిమా విషయానికి వస్తే మహాభారత్‌’ సిరీస్‌ ఫేమ్‌ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. 

సినిమా..
ఈ పాన్‌ ఇండియా మూవీలో విష్ణు కన్నప్పగా నటిస్తున్నాడు. ప్రభాస్, మోహన్‌ బాబు, అక్షయ్‌ కుమార్, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్‌ అగర్వాల్, మధుబాల, దేవరాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో సినిమా రిలీజ్‌ చేయనున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement