
సెలబ్రిటీలకు కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలా మంచు విష్ణుకు కన్నప్ప జీవిత కథను సినిమాగా తీయాలని ఓ ఆశ. అందుకోసం తెర వెనక ఎంతో కష్టపడ్డాడు. అందరికీ తెలిసిన కన్నప్ప గురించి ఎవరికీ తెలియని విషయాలను సైతం సేకరించాడు. చరిత్రను తవ్వి చూశాడు. కన్నప్పను నిశితంగా అర్థం చేసుకున్నాడు.
ఈ నెలలోనే రిలీజ్
అంతా ఆకళింపు చేసుకున్నాకే కన్నప్ప సినిమా (Kannappa Movie) ను ప్రకటించాడు. ఈ మూవీ గ్లింప్స్ రిలీజైనప్పుడు ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వచ్చాయి. ఎప్పుడైతే శివుడి పాట విడుదలైందో అప్పుడు ఆ నెగెటివిటీ అంతా మట్టిగొట్టుకుపోయింది. మధ్యలో సినిమా రెండుమూడు సార్లు వాయిదా కూడా పడింది. ఆ పరమేశ్వరుడిపై భారం వేస్తూ జూన్ 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
మా కోసం ఎన్నో త్యాగాలు
తాజాగా విష్ణు మంచు (Vishnu Manchu) మై కన్నప్ప స్టోరీ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. కన్నప్ప.. మహాశివుడికి పెద్ద భక్తుడు. ఓసారి ఆ భగవంతుడు కన్నప్పను పరీక్షించగా అతడు తన రెండు కళ్లను శివయ్యకు అర్పించాడు. తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనకోసం సర్వం ధారపోసేవాళ్లున్నారు. అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, స్నేహితులు.. ఎలా ఎవరైనా కావచ్చు. నా జీవితంలోనూ ఓ కన్నప్ప ఉన్నారు. ఆయనే మా నాన్న.
ఆయనే నా హీరో
ఆయన మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో కష్టపడి మాకు ఏ ఇబ్బందీ లేకుండా పెంచాడు. ఈరోజు మీ ముందు నటుడిగా కూర్చుని మాట్లాడుతున్నానంటే అది ఆయన చేసిన త్యాగాల ఫలితమే! మా నాన్న నటుడిగా కష్టపడి నిలదొక్కుకోవడం వల్లే! ఆయనే నా హీరో. మీ జీవితాల్లో ఉన్న హీరో గురించి మీరు చెప్పండి. మీ కన్నప్ప స్టోరీని ప్రపంచానికి తెలియజేస్తాం అని చెప్పుకొచ్చాడు.
#MyKannappaStory#kannappa #harharmahadevॐ pic.twitter.com/jHXm2Kp0xG
— Vishnu Manchu (@iVishnuManchu) June 3, 2025
చదవండి: ఆ స్టార్ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి