మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరో తెలుసా? | Manchu Vishnu Kannappa Movie Heroine First Look Revealed | Sakshi
Sakshi News home page

Kannappa Movie: మంచు విష్ణు కన్నప్ప.. హీరోయిన్ ఎలా ఉందంటే?

Dec 30 2024 7:36 PM | Updated on Dec 30 2024 8:01 PM

Manchu Vishnu Kannappa Movie Heroine First Look Revealed

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి ప్రముఖులంతా కనిపించనున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లతో పాటు క్యారెక్టర్లను రివీల్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ హీరోయిన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  ఈ సినిమాలో ఆమె నెమలి అనే రాకుమార్తెగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రీతి ముకుందన్ తన గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. అంతకుముందు ప్రీతి టాలీవుడ్ చిత్రం ఓం భీమ్ బుష్‌లో నటించింది. ఈ మూవీలో జలజ అనే పాత్రలో మెరిసింది.

preety

(ఇది చదవండి: 'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!)
 

పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న కన్నప్ప చిత్రాన్ని అవా ఎంటర్ టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇప్పటికే రిలీజైన'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమాతో మంచు విష్ణు తనయుడు అవ్రామ్‌ అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కుమార్తెలు కూడా కన్నప్పలో నటిస్తున్నారు. ఇటీవల వారిద్దరి పోస్టర్లను కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement