కన్నప్పకు చిక్కులు! మంచు విష్ణు ఆఫీస్‌లో జీఎస్టీ సోదాలు | GST Officials Raid On Vishnu Manchu Kannappa Movie Unit | Sakshi
Sakshi News home page

Kannappa Movie: మంచు విష్ణు కార్యాలయంలో జీఎస్టీ అధికారుల సోదాలు

Jun 25 2025 6:42 PM | Updated on Jun 25 2025 7:32 PM

GST Officials Raid On Vishnu Manchu Kannappa Movie Unit

సాక్షి, హైదరాబాద్‌: కన్నప్ప చిత్రయూనిట్‌కు భారీ షాక్‌ తగిలింది. సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు జీఎస్టీ అధికారులు సోదాలకు దిగారు. మంచు విష్ణు (Vishnu Manchu)తో పాటు పలువురి ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం కన్నప్ప.  ప్రీతి ముకుందన్‌ కథానాయిక. ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌బాబు, శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది. కన్నప్ప బడ్జెట్‌ను విష్ణు ఎన్నడూ బయటపెట్టలేదు. ఓ ఇంటర్వ్యూలో రూ.100 కోట్లా? రూ.200 కోట్లా? అని అడిగినప్పుడు కూడా చెప్పేందుకు నిరాకరించాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు తన ఆఫీసుకు వస్తారని, ఎందుకీ గొడవ అని సమాధానం దాటవేశారు. చివరకు సినిమా రిలీజ్‌కు ముందే అధికారులు మంచు విష్ణు కార్యాలయంలో సోదాలకు దిగారు.

చదవండి: వంద కోట్ల క్లబ్‌లో 'కుబేర'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement