కన్నప్పను అభినందిస్తుంటే ఆనందంగా ఉంది  | Manchu Mohan Babu Talks About Kannappa Thanks Meet | Sakshi
Sakshi News home page

కన్నప్పను అభినందిస్తుంటే ఆనందంగా ఉంది 

Jun 29 2025 5:45 AM | Updated on Jun 29 2025 5:45 AM

Manchu Mohan Babu Talks About Kannappa Thanks Meet

– మంచు మోహన్‌బాబు 

‘‘నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం నాది. అప్పట్నుంచి ఇప్పటివరకు నా అభిమానులు నా వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ‘కన్నప్ప’ సక్సెస్‌ తర్వాత వాళ్లంతా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. వారి ప్రేమకు నేను తిరిగి ఏమి ఇవ్వగలను... వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు తెలిపారు.

 విష్ణు మంచు హీరోగా ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. 

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’ కోసం యూనిట్‌ అంతాప్రాణం పెట్టి పని చేశాం. భగవంతుడి ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి ఇంత గొప్ప విజయం దక్కింది. మాకు ఇంత హిట్‌ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. విష్ణు మంచు మాట్లాడుతూ– ‘‘మాలాంటి నటీనటులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేం ఈ స్థాయికి వస్తాం.

 ‘కన్నప్ప’కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదంతా శివలీల. ‘కన్నప్ప’ను ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని చెప్పారు. ముఖేష్‌కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబు, విష్ణుగార్లు పదేళ్లుగా ‘కన్నప్ప’ కోసం కష్టపడుతూ వచ్చారు. మా సినిమా మీద అందరూ ప్రేమను కురిపిస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘కన్నప్ప’ చిత్రం ఎగ్జిక్యూటివ్‌ ్ర΄÷డ్యూసర్‌ వినయ్‌ మహేశ్వరి, మైత్రి డిస్ట్రిబ్యూటర్‌ శశి, నటులు శివ బాలాజీ, కౌశల్, అర్పిత్‌ రంకా మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement