విష్ణు మంచు లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని ఎం. మోహన్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్... ఇలా పలువురు స్టార్స్ కీలక పాత్రలు చేశారు.
రుద్రుడిగా ప్రభాస్, శివ భక్తుడిగా మారే తిన్నడు పాత్రను విష్ణు, శివ పార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్, మహదేవ శాస్త్రిగా మోహన్‌బాబు నటించారు. ఈ సినిమా విడుదలై ఈ నెల 27కి ఏడాది అవుతోంది, ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఈ చిత్రాన్ని లిమిటెడ్ స్క్రీన్స్‌లో మళ్లీ విడుదల చేయనున్నారు.


