వైవిధ్యమైన పాత్రల్లో...  | Manchu Mohan Babu 50 Years Career Journey In Film Industry | Sakshi
Sakshi News home page

వైవిధ్యమైన పాత్రల్లో... 

Mar 19 2026 1:45 AM | Updated on Mar 19 2026 1:45 AM

Manchu Mohan Babu 50 Years Career Journey In Film Industry

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు మంచు మోహన్‌బాబు. నేడు (మార్చి 19) ఆయన పుట్టినరోజు. ‘స్వర్గం నరకం’ (1975) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారాయన. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హీరోగా గొప్ప పాత్రలు ΄ోషించారు. నిర్మాతగానూ తిరుగులేని విజయాలను అందుకున్నారు. 

ఒక నటుడు నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం విశేషం. 600లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పటికీ నటుడిగా బిజీగా ఉన్నారు. వైవిధ్యమైన పాత్రలతో నేటి తరాన్ని కూడా మెప్పించబోతున్నారు. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘ది ΄్యారడైజ్‌’, ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న ‘శ్రీనివాసమంగాపురం’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను ΄ోషిస్తున్నారు మోహన్‌బాబు.  

Advertisement
 
Advertisement
Advertisement