మంచు విష్ణు సాహసం.. కన్నప్ప స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Manchu Vishnu Latest Kannappa Movie To Stream In Youtube, Check Out Release Date And Channel Details | Sakshi
Sakshi News home page

Kannappa Movie: మంచు విష్ణు సాహసం.. ఏడాది తర్వాత కన్నప్ప స్ట్రీమింగ్

Jul 2 2026 10:19 PM | Updated on Jul 3 2026 11:18 AM

Manchu Vishnu Latest Movie Kannappa streaming youtube Channel

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన మూవీ 'కన్నప్ప'. గతేడాది జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ నటించారు. ఈ సినిమాకు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు.

అయితే ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. గతంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్‌ 4న ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి స్ట్రీమింగ్‌కు రాలేదు. అమెజాన్ ప్రైమ్‌లో కేవలం హిందీ వర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే సౌత్ భాషల్లో ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.

తాజాగా మంచు విష్ణు కన్నప్ప మూవీపై షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని నేరుగా సొంత ‍యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 03 నుంచి అవా ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్లో స్ట్రీమింగ్ కానుందని  పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇది చూసిన సినీ ప్రియులు మంచు విష్ణు డేరింగ్ డెసిషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కన్నప్ప కథేంటంటే..

'కన్నప్ప' విషయానికొస్తే.. గూడెంలో పుట్టి పెరిగిన తిన్నడు(విష్ణు).. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వల్ల నాస్తికుడిగా మారిపోతాడు. చుట్టుపక్కలా గూడేల్లో ఏ ఆపద వచ్చిన ముందుంటాడు. అలాంటి కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి బహిష్కరణకు గురవుతాడు. ప్రేయసి నెమలి(ప్రీతి ముకుందన్) కూడా ఇతడి వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు.. గొప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు? ఇంతకీ రుద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement