విశ్వదేవ్, బిందు మాధవి
‘‘డార్క్ చాక్లెట్’ కొత్త తరహా సినిమా. ఈ చిత్రం గురించి ఆడియన్స్ కచ్చితంగా మాట్లాడుకుంటారు’’ అని విశ్వదేవ్ రాచకొండ అన్నారు. ఆయన హీరోగా శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డార్క్ చాక్లెట్’. ఓ ప్రధాన పాత్రలో బిందు మాధవి నటించారు. రానా దగ్గుబాటి సమర్పణలో స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రోడక్షన్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘కల్లో కల్లోలం... ఇది కంట్రోలే కాని కలకలం’ సాంగ్ లాంచ్‌ను నిర్వహించారు మేకర్స్. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ స్వరకల్పనలో బాలాదిత్య సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. ‘‘కల్లో కల్లోలం...’ పాటలో ఈ సినిమా కథంతా నిక్షిప్తమై ఉంది. కొత్త రకం డార్క్ కామెడీ సినిమా ఇది’’ అని ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో శశాంక్ పేర్కొన్నారు.


