జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కుకూన్స్". ఈ చిత్రాన్ని న్యూ వేవ్ పిక్చర్స్, ఎం ఆర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుకేశ్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మహేశ్ గౌరి దర్శకత్వం వహిస్తున్నారు . ఈ మూవీని యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ..'కుకూన్స్ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ పోస్టర్ కొత్తగా ఆకట్టుకుంది. డైరెక్టర్ మహేశ్ గౌరి సరికొత్త ఆలోచనలు ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. టైటిల్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసిన వికాస్ గతంలో డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకు మెంటార్‌గా పనిచేశారు. ఇప్పుడీ చిత్రంతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జగన్, సాగర్, వికాస్‌తో పాటు మిగతా టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్' తెలిపారు. ఈ సినిమాకు బీఎన్ ఆదిత్య సంగీతమందిస్తున్నారు.
The motion poster of #Cocoons has been launched by the energetic director @AnilRavipudi 💥
Cocoons - sounds cute, but there’s definitely something fun brewing inside🔥 pic.twitter.com/vv7yvQRFkV— Vamsi Kaka (@vamsikaka) October 1, 2026


