సింపుల్‌ ఫుడ్‌తో సూపర్‌ ఫిట్‌నెస్‌ | Saif Ali Khan Simple Diet Plan | Sakshi
Sakshi News home page

సింపుల్‌ ఫుడ్‌తో సూపర్‌ ఫిట్‌నెస్‌

Aug 16 2026 3:11 PM | Updated on Aug 16 2026 3:24 PM

Saif Ali Khan Simple Diet Plan

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ఈ రోజు (ఆగస్టు 16) తన 56వ పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటున్నారు. నటనతో పాటు ఫిట్‌నెస్‌ విషయంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాందించాడు. కఠినమైన డైట్‌లకు దూరంగా ఉండే సైఫ్‌.. సాధారణ ఇంటి ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారట.  తన రోజువారీ ఆహారపు అలవాట్లు గురించి ఓ ఇంటర్య్వూలో తెలిపాడు.

‘ఉదయం అల్పాహారంగా గుడ్లు, టోస్ట్‌ తీసుకుంటా. మధ్యాహ్నం భోజనంలో బెండకాయ కూర, పప్పు, క్యారెట్‌, బఠానీ కూరతో పాటు ఒక రోటీ తింటా. అప్పుడప్పుడు చేపలు, అన్నం కూడా తీసుకుంటా. రాత్రి భోజనంలో మాత్రం మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడతా’ అని సైఫ్‌ వెల్లడించారు. 
షూటింగ్‌ సమయంలోనూ ఫిట్‌గా ఉండేందుకు ఇంటి భోజనాన్ని తీసుకెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఆహారం విషయంలో రుచుల కంటే ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే సైఫ్‌ అలీ ఖాన్‌ ‘హైవాన్‌’ చిత్రంతో రాబోతున్నారు.  ఈ సినిమాలో ఆయనతో పాటు అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement