కేదారేశ్వరుని సేవలో కన్నప్ప టీమ్.. వీడియో వైరల్! | Kannappa Movie Team Visits Badrinath Temple Ahead Of Release | Sakshi
Sakshi News home page

Kannappa Movie: కేదారేశ్వరుని సేవలో కన్నప్ప టీమ్.. వీడియో వైరల్!

Oct 25 2024 5:09 PM | Updated on Oct 25 2024 5:15 PM

Kannappa Movie Team Visits Badrinath Temple Ahead Of Release

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉ‍న్నారు. ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని షూటింగ్‌ను విదేశాల్లో చిత్రీకరించారు. కన్నప్పలో ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్‌ నటులు కనిపించనున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ముఖేష్ కుమార్  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్  దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది  డిసెంబర్‌లో పాన్‌ ఇండియాలో విడుదల చేయడానికి కన్నప్ప టీమ్ సన్నాహాలు చేస్తోంది.

తాజాగా కన్నప్ప టీమ్ ఆలయాల సందర్శనకు బయలుదేరింది. మంచువిష్ణు, మోహన్ బాబుతో సహా పలువురు చిత్రబృంద సభ్యులు బద్రినాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివుని భక్తుడైన కన్నప్ప మూవీ సక్సెస్ కావాలని కేదారాశ్వరుని ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. ఇప్పటికే కన్నప్ప టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ‍అత్యధి వ్యూస్‌ సాధించింది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement