
మంచు విష్ణు కన్నప్ప సినిమా (Kannappa Movie)లో నార్త్ నుంచి సౌత్ వరకు పెద్ద పెద్ద స్టార్స్ భాగమయ్యారు. ప్రభాస్, మోహన్‌లాల్, శరత్‌కుమార్, అక్షయ్‌కుమార్.. ఇలా పలువురు కన్నప్ప చిత్రంలో నటించారు. అక్షయ్‌కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా యాక్ట్ చేశారు. మొదట ఈ మూవీ చేసేందుకు అక్షయ్ అసలు ఒప్పుకోనేలేదు. రెండుసార్లు రిజెక్ట్ చేశాడు. అయినా విష్ణు పట్టు వదలకుండా ప్రయత్నించి ఆయన్ను ఎలాగోలా ఒప్పించాడు.
డైలాగ్స్ చెప్పేందుకు అక్షయ్ కుమార్ తిప్పలు
అలా అక్షయ్ కుమార్ వెండితెరపై మహాశివుడిగా కనిపించాడు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది, కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు. తాజాగా ఈ సినిమాలోని ఓ క్లిప్ నెట్టింట విపరీతంగా వైరలవుతోంది. అందులో అక్షయ్ కుమార్ డైలాగులు నేర్చుకుని సొంతంగా చెప్పినట్లు కనిపించడం లేదు. టెలిప్రాంప్టర్‌ను చూస్తూ అక్కడ రాసున్న డైలాగ్స్ చదువుతున్నట్లుగా ఉంది. అది అతడి కళ్లు తిప్పడం చూస్తేనే అర్థమైపోతుంది.
ఇది చీటింగ్ కాదా?
ఇది చూసిన నెటిజన్లు అక్షయ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ డైలాగ్స్ గర్తుపెట్టుకుని చెప్పలేడా? ఎందుకిలా సగం సగం యాక్టింగ్ చేయడం? శివుడి వేషం కట్టుకుని చిన్న డైలాగ్స్ కూడా చెప్పడం రాకపోతే ఎలా? ఇది జనాల్ని చీటింగ్ చేయడమే అవుతుంది అని కామెంట్లు చేస్తున్నారు. అయితే సదరు వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. కాగా అక్షయ్ కుమార్.. ఇలా ప్రాంప్టర్ చూసుకుంటూ డైలాగ్స్ చెప్పడం కొత్తేమీ కాదు. సర్ఫిరా సినిమాలోనూ ఓ సీన్‌లో ఇలాగే డైలాగ్స్ చూసుకుంటూ చదివాడు. అక్షయ్ ప్రస్తుతం జాలీ ఎల్‌ఎల్‌బీ 3, వెల్‌కమ్ టు ద జంగిల్ సినిమాలు చేస్తున్నాడు.
చదవండి: ప్రియుడితో శ్రద్ధా.. సీక్రెట్ వీడియో వైరల్.. ఇంత పని చేస్తారనుకోలేదు