
సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ లేకుండా పోతోంది. వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఎవరో ఒకరు వారిని వెంబడిస్తూనే ఉన్నారు. కెమెరాల కళ్లు గప్పి ఫ్రెండ్స్‌తో లేదా బాయ్‌ఫ్రెండ్‌తో ఎక్కడికైనా వెళ్దామా? అంటే అక్కడ కూడా ఎవరో ఒకరు ఈ జంటను కనిపెట్టి ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) విషయంలో ఇదే జరిగింది.
సీక్రెట్‌గా వీడియో
శ్రద్ధా, ప్రియుడు రాహుల్ మోదీతో కలిసి విమానంలో ప్రయాణించింది. వీరిద్దరూ ఎకానమీ క్లాసులో కూర్చోగా శ్రద్ధా తన ఫోన్‌లో ఏదో రాహుల్‌కు చూపిస్తోంది. దీన్నంతటినీ విమాన సిబ్బంది ఒకరు సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఐదు నెలల క్రితం జరిగిన సంఘటన ఇది. ఏమైందో, ఏమో కానీ తాజాగా మరోసారి ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
రవీనా టండన్ ఫైర్
ఇండియా ఫోరమ్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రత్యక్షమైన ఈ వీడియో హీరోయిన్ రవీనా టండన్ (Raveena Tandon) కంటపడింది. అంతే విమాన సిబ్బందిని ఏకిపారేస్తూ సదరు పోస్ట్ కింద కామెంట్ పెట్టింది. ఇలా రహస్యంగా వీడియో రికార్డ్ చేయడమనేది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ విషయం సిబ్బందికి తెలిసే ఉంటుంది. ముందు వారి అనుమతి తీసుకుని ఆ తర్వాత వీడియో రికార్డ్ చేసుకోవాల్సింది.
ఇంట్లోకి చొరబడి తీసిందా?
ఎయిర్‌లైన్ స్టాఫ్ కూడా ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు అని మండిపడింది. కొందరు ఆమె మాటలతో ఏకీభవిస్తూ.. సెలబ్రిటీలు కూడా మనుషులేనని, వారికి కొంత ప్రైవసీ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. వాళ్లకు లేని ఇబ్బంది మీకెందుకు? ఆమె సెలబ్రిటీ ఇంట్లోకి చొరబడి వీడియో తీయలేదు కదా.. విమాన సిబ్బందిని తిట్టాల్సిన అవసరం లేదు, వారు కూడా మనుషులే అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.