కన్నప్పలో సైడ్‌కి నిలబడే పాత్ర.. మోహన్‌బాబు అడిగితే.. | Siva Balaji Interesting Comments About How Mohan Babu Offered A Role In Kannappa Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

కన్నప్పలో చేయమని మోహన్‌బాబు అడిగితే ఆలోచించా: శివబాలాజీ

Jun 26 2025 9:01 AM | Updated on Jun 26 2025 9:42 AM

Siva Balaji About How Mohan Babu Offered a Role Kannappa Movie

‘‘కన్నప్ప’ చిత్రంలో మహదేవశాస్త్రి (మోహన్‌బాబు పాత్ర) కొడుకుగా యాక్ట్‌ చేయమని మోహన్‌బాబుగారు అన్నప్పుడు ఆలోచించాను. మరీ సైడ్‌కి అలా నిలబడే పాత్ర ఎలా చేయాలని విష్ణుని అడిగితే, ‘నీ ఇష్టం’ అన్నారు. మా ఆవిడ మధుమిత కూడా అలానే అన్నారు. ఫైనల్‌గా ఒప్పుకున్నాను. అయితే ఈ చిత్రంలో ఆ పాత్ర చేసి ఉండకపోతే నేను చాలా మిస్‌ అయ్యేవాణ్ని. ఇప్పుడు నాకు ఆ పాత్ర గొప్పదనం అర్థమైంది’’ అని శివ బాలాజీ అన్నారు. 

విష్ణు మంచు హీరోగా ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కన్నప్ప’. మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించిన శివ బాలాజీ మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’లో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యత కాస్త తక్కువగా ఉంటుంది. కానీ, ఓ గొప్ప చిత్రం, పాన్‌ ఇండియన్‌ సినిమాలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి. ఇక నేను చేసిన ‘రెక్కీ’ సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘రెక్కీ 2’ త్వరలోనే రానుంది. ప్రస్తుతం ‘సిందూరం’ అనే చిత్రం చేశాను. అలాగే మోహన్‌బాబుగారి ప్రొడక్షన్‌లో నేను హీరోగా ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు.

చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్‌ చేశారో చూశారా?: సింగర్‌

Advertisement
 
Advertisement
Advertisement