'కన్నప్ప' తర్వాత మంచు విష్ణు సినిమా ఇదే.. దర్శకుడు ఎవరంటే..? | After Kannappa Manchu Vishnu Next Movie With Prabhudeva, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

'కన్నప్ప' తర్వాత మంచు విష్ణు సినిమా ఇదే.. దర్శకుడు ఎవరంటే..?

Jun 30 2025 8:44 AM | Updated on Jun 30 2025 10:15 AM

Manchu Vishnu Will Next Movie With Prabhudeva

'కన్నప్ప' సినిమా విజయం తర్వాత మంచు విష్ణు జోరు పెంచుతున్నారు.  త్వరలో ఆయన నటించనున్న కొత్త సినిమాపై వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్న దర్శకుడు ఎవరో కూడా సమాచారం బయటికి వచ్చింది. కన్నప్ప  మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మ్యాట్నీ, సాయింత్రం షోలు హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. దీంతో కలెక్షన్స్‌ బాగానే వస్తున్నాయి. ఇదే జోష్‌తో ఆయన మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. 'కన్నప్ప'కు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు తర్వాతి సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వైరల్‌ అవుతుంది.

'కన్నప్ప' హిట్‌ తర్వాత మంచు విష్ణు- ప్రభుదేవా కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ రానుందని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రభుదేవా ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం  వహించారు. గతంలో  నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి వంటి సినిమాలతో దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, కన్నప్ప సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రభుదేవా... మంచు విష్ణుతో మంచి స్నేహం ఏర్పడింది. దీంతో వారిద్దరూ కలిసి ఒక సినిమా చేయనున్నారని టాక్‌.  ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కమర్షియల్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ జానర్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు ఫ్యామిలీనే నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement