
మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన చిత్రం కన్నప్ప అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. తొలి ఆట నుంచే ఈ మూవీకి పాజిటివ్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాపై మంచు మనోజ్ సైతం ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ రోల్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్ల వద్ద అభిమానులు మంచు విష్ణు, ప్రభాస్ అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు.
అయితే కన్నప్ప చూసిన ఓ అభిమాని థియేటర్ వద్ద తన ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. థియేటర్‌కు వచ్చిన అభిమాని కన్నప్ప మూవీపై బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ కేకలు వేశాడు. మంచు విష్ణును ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరి చెబుతున్నా.. పక్కా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా హిట్ అంటూ ఏకంగా తన షర్ట్‌నే చింపుకుని మరి కన్నప్పపై తన అభిమానం చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా చూసిన ప్రభాస్ అభిమానులు సైతం సూపర్ హిట్ అంటూ కామెంట్స్ చేశారు.